టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సాయిపల్లవి ఎలాంటి పాత్రలో నటించినా ఆ పాత్రకు తన నటనతో పూర్తిస్థాయిలో న్యాయం చేస్తారనే సంగతి తెలిసిందే.ఏదైనా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకముందే ఆ సినిమాలో అభ్యంతరంగా ఉండే సన్నివేశాల్లో తాను నటించనని సాయిపల్లవి చెబుతారు.
తను చెప్పిన షరతులకు ఓకే చెప్పిన దర్శకనిర్మాతల సినిమాలలో మాత్రమే ఆమె నటిస్తారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే చాలామంది హీరోయిన్లు డబ్బుకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు.
అయితే సాయిపల్లవి మాత్రం ఇతర హీరోయిన్లకు భిన్నంగా విలువలకు వాల్యూ ఇస్తారు.స్టార్ హీరోలకు జోడీగా నటించకపోయినా సాయిపల్లవికి స్టార్ స్టేటస్ సొంతమైందంటే ఆమెను అభిమానించే అభిమానులు ఏ స్థాయిలో ఉన్నారో అర్థమవుతుంది.
అయితే ఒక డైరెక్టర్ మాత్రం సాయిపల్లవిని ఇబ్బంది పెట్టారని సమాచారం.
సగం సినిమా షూటింగ్ పూర్తైన తర్వాత లిప్ లాక్ సీన్ లో నటించాలని దర్శకుడు కోరడంతో సాయిపల్లవి ఒక మూవీ షూట్ సమయంలో ఇబ్బంది పడ్డారని బోగట్టా.
చివరకు ఈ విషయం హీరో దృష్టికి రావడంతో సాయిపల్లవిని ఇబ్బంది పెట్టవద్దని హీరో సూచించగా దర్శకుడు వెనక్కు తగ్గారని సమాచారం.

సాయిపల్లవి లాంటి హీరోయిన్లు అరుదుగా ఉంటారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
స్కిన్ షోకు దూరంగా ఉన్నప్పటికీ సాయిపల్లవికి సినిమా ఆఫర్లు వస్తున్నాయి.సాయిపల్లవి కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉండగా సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే సాయిపల్లవి రేంజ్ మరింత పెరుగుతుందని చెప్పవచ్చు.
ప్రాజెక్ట్ ల ఎంపిక విషయంలో, దర్శకుల ఎంపిక విషయంలో సాయిపల్లవి ఆచితూచి అడుగులు వేస్తున్నారు.సాయిపల్లవి ఒక్కో సినిమాకు 2 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.
చాలామంది హీరోయిన్ల రెమ్యునరేషన్లతో పోలిస్తే ఈ మొత్తం తక్కువ మొత్తమే కావడం గమనార్హం.