ఆ పని చేయబోతున్న బాలయ్య చిన్న కూతురు.. ఫ్యాన్స్ కు శుభవార్త అంటూ?

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ సీజన్1 ఫస్ట్ ఎపిసోడ్ కు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చిందనే సంగతి తెలిసిందే.కేవలం 24 గంటల్లో ఈ ఎపిసోడ్ కు ఏకంగా 10 లక్షల వ్యూస్ వచ్చాయంటే ఈ ఎపిసోడ్ ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుందో సులువుగా అర్థమవుతుంది.

 Good News For Star Hero Balakrishan Fans Nandmuri Tejaswini Entering As Producer-TeluguStop.com

ఈ షో సెకండ్ ఎపిసోడ్ కు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ హాజరు కానున్నారు.

సిద్ధు జొన్నలగడ్డ ఈ ఏడాది డీజే టిల్లు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.

ఈ సినిమాకు సీక్వెల్ గా డీజే టిల్లు2 తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.మరోవైపు అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాతో హిట్ సాధించిన విశ్వక్ సేన్ ఓరి దేవుడా సినిమాతో ఈ నెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

హీరో వెంకటేష్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించడం ఈ సినిమాకు ఒక విధంగా ప్లస్ అయింది.

బాలయ్య షోలో సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ ఎలాంటి సీక్రెట్స్ ను బయటపెడతారో చూడాలి.

అయితే స్టార్ హీరోలను ఈ షోకు గెస్ట్ లుగా ఆహ్వానిస్తే బాగుంటుందని కొంతమంది సూచనలు చేస్తున్నారు.

Telugu Balakrishna, Siddhu, Tejaswini, Unstoppable, Vishwak Sen-Movie

బాలయ్య అన్ స్టాపబుల్ షో ఊహించని స్థాయిలో సక్సెస్ కావడానికి కారణమైన వాళ్లలో బాలయ్య చిన్న కూతురు తేజస్విని ఒకరు.తేజస్విని సినిమాల్లోకి నిర్మాతగా ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది.

నందమూరి వారసురాలు తేజస్విని నిర్మాతగా కెరీర్ ను మొదలుపెడితే సక్సెస్ అవుతారో లేదో చూడాల్సి ఉంది.

స్టార్ హీరో బాలకృష్ణతో ఒక సినిమాను నిర్మించాలని తేజస్విని భావిస్తున్నట్టు తెలుస్తోంది.బాలయ్య ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలు విడుదలైన తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలుకానుందని సమాచారం అందుతోంది.

మరోవైపు బాలయ్య కొత్త సినిమా ఈ ఏడాదే థియేటర్లలో విడుదల కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube