బ్లాక్ బస్టర్ గా నిలిచిన కాంతార బడ్జెట్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే?

ప్రస్తుతం సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో కాంతార మూవీ గురించి జోరుగా చర్చ జరుగుతోంది.రిషబ్ శెట్టి, సప్తమి గౌడ హీరోహీరోయిన్లుగా నటించిన కాంతార సినిమాలోని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా ఉన్నాయి.

 Block Buster Hit Movie Kantara Budget Details Here Goes Viral,kantara Movie,kant-TeluguStop.com

రిషబ్ శెట్టి ఈ సినిమాకు హీరో కావడం దర్శకుడు కావడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుండటం గమనార్హం.ప్రస్తుతం ఈ సినిమా భాషతో సంబంధం లేకుండా సంచలనం సృష్టిస్తోంది.

పరిమిత బడ్జెట్ తోనే ఈ సినిమా తెరెకక్కగా ఈ సినిమా బడ్జెట్ కేవలం 16 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.ఈ సినిమా బడ్జెట్ తో పోల్చి చూస్తే ఇప్పటికే ఈ సినిమాకు ఎన్నో రెట్లు ఎక్కువ మొత్తం కలెక్షన్లు వచ్చాయి.

తెలుగు రాష్ట్రాల్లో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా విడుదల కాగా అడ్వాన్స్ బుకింగ్స్ బాగుండటంతో పాటు మౌత్ టాక్ పాజిటివ్ గా ఉండటంతో కాంతార సినిమాకు రోజురోజుకు కలెక్షన్లు పెరుగుతున్నాయి.

Telugu Break, Budget, Kantara, Kantara Budget, Kantra Review, Saptami Gowda-Movi

పరిమిత బడ్జెట్ తో ఈ సినిమా తెరెకక్కడంతో పాటు ఇతర భాషల్లో కూడా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో ఈ సినిమా గురించి జోరుగా చర్చ జరుగుతుండటం గమనార్హం.తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 2 కోట్ల రూపాయల లోపే ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ఈ సినిమా సులువుగా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.ఈ సినిమా హక్కులు కొన్నవాళ్లకు సైతం భారీ మొత్తంలో లాభాలు దక్కే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.

కాంతార సినిమా గురించి పాజిటివ్ గా ప్రచారం జరుగుతుండటంతో ఈ సినిమాపై ఆసక్తి చూపుతున్న ప్రేక్షకుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.కాంతార సినిమా ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాల్సి ఉంది.

ఈ సినిమా వల్ల రిషబ్ శెట్టిని అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube