ప్రముఖ పారిశ్రామిక దేశీయ దిగ్గజం ఆనంద్ మహింద్రా ఊపిరి సలపనంత బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో చురుకుగా ఉంటారు.ఈ క్రమంలో అతనికి నచ్చిన విషయాలను ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ వుంటారు.
దాదాపు ప్రతి రోజు ఏదో ఒక పోస్ట్ పెడుతూ లైం లైట్ లో చురుకుగా వుంటారు.తాజాగా అంటే నిన్న బుధవారం కూడా ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేసి నెటిజన్లలో ఆసక్తి రేకెత్తించారు.
తాను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పే తొలి వ్యక్తికి ట్రాక్టర్ను బహుమతిగా అందజేస్తానని ఈ సందర్భంగా ప్రకటించారు.
వివరాల్లోకి వెళితే, అతను ట్విట్టర్ వేదికగా ఒక వీడియో పోస్ట్ చేసారు.
ఆ వీడియోలో ట్రాక్టర్లతో పాటు కొందరు వ్యక్తులు కనిపించారు.ఆ వీడియోను ఉద్దేశిస్తూ.“ఇక్కడ కనిపిస్తున్నవి మహింద్రా ట్రాక్టర్లే.అయితే ఇది ఏ దేశానికి సంబందించిన వీడియో? సరైన సమాధానం చెప్పిన మొదటి వ్యక్తికి చిత్రంలో కనిపిస్తున్న మోడల్ ట్రాక్టర్ ఒకటి ఖచ్చితంగా పంపిస్తాను” అని రాసుకొచ్చారు.దాంతో ఈ ట్వీట్ బాగా వైరల్ అవుతోంది.చాలామంది దానికి సమాధానాలు వెతకడం ఆరంభించారు.
దీనిపై నెటిజన్లు స్పందిస్తూ… “ఈ ప్రశ్నకు సమాధానం చెప్పి ట్రాక్టర్ గెలుచుకోబోయే అదృష్టవంతులు ఎవరో?” అని ఒకరంటే, “ఆనంద్ సార్.నా సమాధానం జర్మనీ” అని ఒకరు, “బ్రెజిల్” అని మరొకరు, ‘జర్మనీ’ అని వేరొకరు సమాధానం ఇచ్చారు.అయితే స్పందించినవారిలో ఎక్కువగా జర్మనీ అని బదులిచ్చారు.కాగా ఇలాంటి మోడల్ ట్రాక్టర్లను భారత్లో విడుదల చేస్తారా? అంటూ మరికొందరు ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు.ఇక దీనికి ఆనంద్ మహింద్రా సమాధానం ఇస్తాడా అనేది చూడాలి.అలాగే ఆ కొత్త ట్రాక్టర్ ఎవరికి దక్కనుందనేది కూడా తెలియాల్సి వుంది.