మాస్క్ తీయమన్న ఫోటోగ్రాఫర్స్.. ఫేస్ చూస్తే భయపడతారు..రష్మిక కామెంట్స్ వైరల్!

నేషనల్ క్రష్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి రష్మిక ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమా అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే ఈమె ప్రస్తుతం వరుస సినిమా షూటింగులతో బిజీగా ఉండగా కాస్త తన సినిమా షూటింగ్లకు బ్రేక్ ఇచ్చి నాలుగు రోజులు పాటు మాల్దీవుల వెకేషన్ కి వెళ్ళిన విషయం మనకు తెలిసిందే.

 Photographers Who Take Off The Mask They Get Scared When They See The Face Rashm-TeluguStop.com

ఇకపోతే ఈమె మాల్దీవులలో ఎంతో ఎంజాయ్ చేసిన అనంతరం తిరిగి ముంబై చేరుకున్నారు.

ఈ క్రమంలోనే ముంబై ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చిన రష్మికను ఫోటోగ్రాఫర్లు ఒక్కసారిగా చుట్టుముట్టి తన ఫోటోలను కెమెరాలలో బంధించారు.

అయితే ఫోటోగ్రాఫర్లు మేడం ఒకసారి మాస్క్ తీయండి ప్లీజ్ అంటూ రష్మికను వేడుకున్నారు.దీనికి రష్మిక ఇప్పుడు మాస్క్ తీస్తే మీరు నా ఫేస్ చేసి భయపడతారు అసలు తీయను అంటూ సమాధానం చెప్పింది.

నాలుగు రోజులపాటు వెకేషన్ లో ఉన్న రష్మిక ఫేస్ మొత్తం నల్లగా మారిపోయిందని అందుకే తాను మాస్క్ తీయదలుచుకోలేదంటూ సమాధానం చెప్పి వెళ్ళిపోయారు.

Telugu Photographers, Rashmika, Scared Face-Movie

కనీసం కారులోకి వెళ్లేముందు అయినా మాస్క్ తీయండి అంటూ ఫోటోగ్రాఫర్లు వేడుకోగా అందుకు రష్మిక ఏ మాత్రం ఒప్పుకోలేదు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇకపోతే రష్మిక ప్రస్తుతం వారసుడు సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు.

ఇవే కాకుండా బాలీవుడ్ మూడు సినిమాలతో బిజీగా ఉన్నటువంటి ఈమె త్వరలోనే పుష్ప2 సినిమా షూటింగ్లో కూడా బిజీ కానున్నారు.తాజాగా హిందీలో నటించిన గుడ్ బై సినిమా విడుదల కాగా ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube