నల్గొండ జిల్లాలో భారీగా నిషేధిత గంజాయి పట్టుబడింది.చిట్టాల వద్ద డీసీఎంలో అక్రమంగా తరలిస్తుండగా 862 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.ఏవోబీ నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా పట్టుకున్నారు.
సినిమాను తలపించే రీతిలో గంజాయిని తరలిస్తున్నారు నిందితులు.దీనికోసం డీసీఎంలో ప్రత్యేకంగా క్యాబిన్ ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ క్రమంలో డీసీఎంతో పాటు ఓ కారును సీజ్ చేశారు.పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.కోటి 30 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.







