RAPO20 : పండుగ సందర్భంగా బోయపాటి గుడ్ న్యూస్.. రామ్ జోడీగా శ్రీలీల!

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా RAPO20.ఈ సినిమా ఎప్పుడో ప్రకటించారు.

ఇటీవలే బోయపాటి బాలయ్యతో అఖండ సినిమా తీసి ఘన విజయం అందుకుని మరొక బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు.ఈ సినిమా విజయం తర్వాత బోయపాటి శ్రీను రామ్ పోతినేని తో సినిమా ప్రకటించాడు.

రామ్ పోతినేని ఎనర్జీ బోయపాటి యాక్షన్ తో మిక్స్ అయితే ఇక అదిరిపోయే మాస్ ప్రాజెక్ట్ రెడీ అవుతుంది.అందుకే ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ఈ సినిమాపై అంచనాలు పెరిగి పోయాయి.

ఇది పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుండడంతో ఫుల్ ఫోకస్ పెట్టి తెరకెక్కించ బోతున్నారు.ఇక ఈ సినిమా నుండి దసరా కానుకగా క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

Advertisement

ఈ సినిమాలో రామ్ పోతినేనికి జోడీగా హీరోయిన్ ను ఫిక్స్ చేసారు.పెళ్లి సందడి బ్యూటీ శ్రీలీల ఈ సినిమాలో భాగం కానుంది అంటూ పోస్టర్ ద్వారా అఫిషియల్ గా అనౌన్స్ చేశారు.

దీంతో ఈ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది.శ్రీలీల మొదటి సినిమాతో మంచి నటన, అందం, డ్యాన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసి టాలీవుడ్ లో సెటిల్ అయిపొయింది.

వరుస అవకాశాలు అందుకుంటూ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.

ఇక ఇప్పుడు బోయపాటి, రామ్ పాన్ ఇండియా సినిమాలో అవకాశం కొట్టేసి లక్కీ హీరోయిన్ గా మారిపోయింది.ఇక ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు కూడా టాక్ బయటకు వచ్చింది.అలాగే ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ ను తీసుకున్నట్టు తెలుస్తుంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై నిర్మిస్తున్నాడు.మరి ఈ సినిమాతో రామ్ ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు