ప్రస్తుతకాలంలో ఆహారపు అలవాట్లు, మారిన జీవన శైలి, ఒత్తిడి, పోషకాల కొరత, మద్యపానం, ధూమపానం తదితర కారణాల వల్ల చిన్న వయసులోనే వృద్ధాప్య లక్షణాలు తలుపు తడుతున్నాయి.దాంతో ఎందరో మంది ముప్పై ఏళ్లకే ముసలివారిగా కనిపిస్తున్నాయి.
ఈ జాబితాలో మీరు ఉండకుండా ఉండాలి అంటే కచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ ఆయిల్‌ను వాడాల్సిందే.ఈ ఆయిల్ తో వారంలో మూడంటే మూడు సార్లు మసాజ్ చేసుకుంటే కనుక యాబైలోనూ యంగ్‌గా కనిపించవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ మ్యాజికల్ ఆయిల్‌ను ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి.
ముందుగా ఒక క్యారెట్ ను తీసుకుని తొక్క తొలగించి నీటిలో శుభ్రంగా కడిగి సన్నగా తురుముకోవాలి.
ఈ క్యారెట్ తురుమును ఒక కాటన్ వస్త్రం పై వేసి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో రెండు, మూడు గ్లాసుల వాటర్ పోసి మరిగించాలి.
ఈ లోపు మరో గిన్నె తీసుకుని అందులో ఒక కప్పు స్వీట్ ఆల్మండ్ ఆయిల్, క్యారెట్ తురుము, అర కప్పు ఆరెంజ్ పండు తొక్కలు వేసుకుని బాగా మిక్స్ చేయాలి.
ఈ గిన్నెను మరుగుతున్న నీటిలో పదిహేను నిమిషాల పాటు ఉంచి డబల్ బాయిలర్ మెథడ్ లో ఉడికించాలి.
ఆపై పల్చటి వస్త్రం సాయంతో ఆయిల్‌ను సపరేట్ చేసుకోవాలి.ఈ ఆయిల్ లో రెండు చుక్కలు రోజ్ ఎసెన్షియల్ ఆయిల్, హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకుంటే మన మ్యాజికల్ ఆయిల్ సిద్ధమైనట్టు.
ఈ ఆయిల్ ను ఒక బాటిల్ లో నింపుకుని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవాలి.

వారంలో మూడు సార్లు ఈ ఆయిల్ ను ముఖంతో పాటు మెడకు కూడా అప్లై చేసుకుని స్మూత్‌గా మసాజ్ చేసుకోవాలి.రెండు లేదా మూడు గంటల అనంతరం నార్మల్ వాటర్ తో చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.ఇలా చేస్తే ముడతలు, సన్నని చారలు, చర్మం సాగటం వంటి వృద్ధాప్య లక్షణాలు రాకుండా ఉంటాయి.
అలాగే వయసు పెరిగిన చర్మం యవ్వనంగా మరియు కాంతివంతంగా మెరిసిపోతూ కనిపిస్తుంది.