ఇయాన్ విధ్వంసం...అమెరికాలో ఇప్పటివరకూ ఎంతమంది మృతి చెందారంటే..

అగ్ర రాజ్యం అమెరికాపై ఊహించని విధంగా దాడిచేసిన ప్రకృతి విపత్తు ఇయాన్ పెను విధ్వంసమే సృష్టించిందని చెప్పాలి.

అమెరికాలోని ఫ్లోరిడా వాసులకు కంటి మీద కునుకులేకుండా చేసిన ఇయాన్ ఎంతో మంది అమెరికన్స్ ను పొట్టన పెట్టుకుంది.

గంటకు 250 కిలోమీటర్ల వేగంతో దూసుకువచ్చిన ఇయాన్ గాలులకు పెద్ద పెద్ద పడవలు సైతం ఇళ్ళ మధ్యకు కొట్టుకువచ్చాయి.ఈ క్రమంలో తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ఉన్న సుమారు 2 లక్షల మందిని అత్యవసరంగా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ముందస్తు జాగ్రత్తలు చేపట్టేలోగానే ఎంతో మంది అమెరికన్స్ ప్రాణాలు పోగొట్టుకున్నారు.ప్రభుత్వం వెల్లడించిన లెక్కల ప్రకారం ఇయాన్ తుఫాను కారణంగా ఇప్పటి వరకూ సుమారు 54 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది.

ఇందులో సుమారు 47 మంది ఒక్క ఫ్లోరిడాలోనే మృతి చెందగా మిగిలిన వారు నార్త్ కరోలినా లో మృతి చెందినట్టుగా తెలుస్తోంది.ఇదిలాఉంటే తుఫాను ప్రభావిత ప్రాంతాలలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ఆయన సతీమణి జిల్ బిడెన్ పర్యటించనున్నట్టుగా తెలుస్తోంది.

Advertisement

కాగా అమెరికాలోని కరోలినాస్ కి ఇప్పటివరకూ విద్యుత్ సేవలు తిరిగి ప్రారంభించ లేదని తెలుస్తోంది ఈ ప్రభావంతో లక్షలాది మంది ప్రజలు ఎలాంటి కమ్మ్యునికేషన్ లేక చీకట్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

చాలా ప్రాంతాలలో విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో ఏం చేయాలో కూడా వారికి దిక్కుతోచని పరిస్థితి ఎర్పడింది.సమాచార వ్యవస్థ లేకపోవడంతో అత్యవసర పరిస్థితులు ఉన్నా ఎవరిని సంప్రదించాలో ఎలా సంప్రదించాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు.ఈ క్రమంలో సమాచార వ్యవస్థను పునరుద్దరించడానికి 120 స్టార్ట్ లింక్ శాటిలైట్ సేవలను టెస్లా అధినేత ఎలన్ మాస్క్ అందిస్తున్నట్టుగా ఫ్లోరిడా గవర్నర్ డిసాటిన్ తెలిపారు.

ఇప్పటి వరకూ అమెరికా చరిత్రలో ఇలాంటి విపత్తు చూడలేదని ఫ్లోరిడాలో వీధులు అన్నీ నదులుగా మారిపోయాయని భారీ స్థాయిలో ఆస్తి నష్టం జరిగిదని అంటున్నారు నిపుణులు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు