కాఫీ విత్ కరణ్ షోలో అలియా భట్ పేరెత్తను.. కరణ్ జోహార్ షాకింగ్ నిర్ణయం?

బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్‌ జోహార్ నిర్మాతగా వ్యవహరిస్తున్న షో కాఫీ విత్ కరణ్.

ఈ షో కి ఇప్పటికే టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొన్న విషయం తెలిసిందే.

అయితే ఈ షో కి వచ్చిన సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలను అడుగుతూ వారి వ్యక్తిగత విషయాలను కూడా బయటికి లాగుతూ ప్రేక్షకులకు కావాల్సినంత అందిస్తున్నారు కరణ్ జోహార్.ఇది ఇలా ఉంటే ఈ షో ముగింపు దశకు చేరుకుంది.

కాగా హాట్‌స్టార్‌ వేదికగా ప్రసారమైన సరికొత్త ఎపిసోడ్‌లో కరణ్‌ షోకు జ్యురీగా వ్యవహరిస్తోన్న పలువురు సోషల్‌ మీడియా సెలబ్రిటీలు, కమెడియన్స్‌ పాల్గొన్నారు.ఇందులో భాగంగానే ఈ షో విషయంలో నెటిజన్స్ నుంచి ఎక్కువగా వచ్చిన ఓ ట్రోల్స్‌ పై కరణ్‌ స్పందించారు.

కరణ్ జోహార్ ఈ సీజన్లోని చాలా ఎపిసోడ్స్ లో మీరు ఆలియా బట్ అవసరం లేకపోయినా కూడా ఆమె పేరును సంబోధించి మరి ఆమెని మెచ్చుకున్నారు అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ వచ్చాయి అని జ్యురీలోని సభ్యులు చెప్పారు.కాగా ఇదే విషయం పై కరణ్‌ స్పందిస్తూ.

Advertisement

అలియా గురించి నేను ఎక్కువగా మాట్లాడానని అంటున్నారు.నిజంగానే నేను అంతలా మాట్లాడానా? ఇటీవల అలియా,నేను ఇదే విషయంపై చర్చించుకున్నాం.

కరణ్ మీరు నాపై చూపిస్తోన్న అభిమానానికి కృతజ్ఞతలు.ఇకపై నా పేరు ఎక్కువగా వాడకండి అని అలియా చెప్పింది అని చెప్పుకొచ్చారు కరణ్ జోహార్.అయితే అలియా భట్ మాట ప్రకారమే ఆమె చెప్పిన తర్వాత నుంచి కాఫీ విత్‌ కరణ్‌ షోలో వీలైనంత తక్కువగా ఆమె గురించి మాట్లాడాను అని తెలిపారు కరణ్ జోహార్.

మొత్తానికి సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ అలాగే అలియా భట్ మాటలను తలుచుకున్న కరణ్ జోహార్ ఇకపై అలియా భట్ పేరు ఎత్తను అంటూ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు