అమ్మ చివరి కోరికను తీర్చలేక పోయిన మహేష్ బాబు.. ఆ కోరిక ఏమిటంటే?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి అనారోగ్య సమస్యలతో మరణించిన విషయం మనకు తెలిసిందే.తల్లి అంటే ఎంతో ప్రేమ ఉన్నటువంటి మహేష్ బాబు ఆమె మరణంతో ఎంతో కృంగిపోయారు.

 Mahesh Babu Who Could Not Fulfill His Mothers Last Wish Details, Mahesh Babu , M-TeluguStop.com

ఇకపోతే మహేష్ బాబు ఎన్నో సందర్భాలలో తన తల్లిపై ఉన్న గౌరవ మర్యాదలను ప్రేమను వ్యక్తపరిచారు.తన మనసు బాగా లేకపోయినా తన సినిమా రిలీజ్ అవుతున్న వెంటనే తన తల్లి దగ్గరకు వెళ్లి తన తల్లి చేత కాఫీ తాగితే తనకు ఎంతో ప్రశాంతంగా ఉంటుందని అదే ఆమె ఆశీర్వాదం అంటూ ఈయన తన తల్లి గురించి తెలియజేశారు.

ఈ విధంగా మహేష్ బాబుకు ఇందిరా దేవిపై ఎంతో ప్రేమ ఉందని అయితే తన తల్లి ఎంతో ప్రేమగా అడిగిన చివరి కోరికను మహేష్ బాబు తీర్చలేకపోయారని తెలుస్తుంది.ఇందిరా దేవి తన చివరి కోరికగా మహేష్ బాబుని ఓ కోరిక కోరారట.

తనకు సితార ఓణీల ఫంక్షన్ చూడాలని ఉంది తనకు ఓణీల ఫంక్షన్ చేయమని మహేష్ బాబుని అడగడంతో ఓణీల ఫంక్షన్ చేయటం ఇష్టం లేని మహేష్ బాబు ఇప్పుడు అలాంటివన్నీ ఎందుకమ్మా అంటూ తన తల్లి మాటను వినిపించుకోలేదట.అయితే ఇందిరా దేవి ఈ కోరిక కోరిన అనంతరం ఆమెకు అనారోగ్యం చేయడంతో మహేష్ బాబు ఈ విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు.

Telugu Ghattamaneni, Indira Devi, Indradevi, Krishna, Mahesh Babu-Movie

ఇలా తన తల్లి చివరి కోరిక అడగడంతో మహేష్ బాబు ఆ కోరిక తీర్చలేకపోయారు అయితే తన తల్లి మరణం తర్వాత ఎంతో కృంగిపోయిన మహేష్ బాబుకు ఈ విషయం మరింత బాధిస్తోందని వార్తలు వస్తున్నాయి.ఇక సితారకు కూడా తన నాన్నమ్మ అంటే ఎంతో ఇష్టం సితార తన అమ్మ పోలికలతో ఉండటం వల్ల మహేష్ బాబు సితారపై ఎంతో ప్రేమను చూపిస్తుంటారు.ఇక తన నాన్నమ్మ దగ్గరికి వచ్చినప్పుడు సితార కూడా ఎక్కువ సమయం తనతో స్పెండ్ చేసేవారట.అయితే తన నాన్నమ్మ అనారోగ్యంతో మరణించడంతో సితార ఎంతో ఎమోషనల్ అయిన సంగతి మనకు తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube