బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ గురించి మనందరికీ తెలిసిందే.బాలీవుడ్ లో ఉన్న పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లలో కరణ్ జోహార్ కూడా ఒకరు.
కరణ్ జోహార్ కి ధర్మా ప్రొడక్షన్స్ అనే ఒక సొంత నిర్మాణ సంస్థ ఉన్న విషయం తెలిసిందే.ఇక తన నిర్మాణ సంస్థ ద్వారా, తన సినిమాల ద్వారా పలువురుస్తారు వారసులను లాంచ్ చేస్తూ ఉంటాడు కరణ్ జోహార్.
కాగా ఇదే విషయంపై కరణ్ జోహార్ ని నెటిజెన్స్ కొన్నేళ్లుగా ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు.ఎలా పడితే అలా కామెంట్స్ చేస్తూ పురుష పదజాలంతో దూషిస్తున్నారు.
అంతేకాకుండా సోషల్ మీడియాలో కామెంట్స్ బాక్స్ ను మొత్తం అసభ్య పదజాలంతో నింపేస్తున్నారు పలువురు నెటిజన్స్.కానీ కరణ్ జోహార్ ఎంతమంది ఎన్ని విధాలుగా ట్రోలింగ్స్ చేసినా కూడా పెద్దగా పట్టించు కోకుండా తన పని తాను చేసుకుంటూ వెళుతూ ఉంటాడు.
అయితే కరణ్ జోహార్ ఈ ట్రోలింగ్స్ పై స్పందిస్తూ వాటి ప్రభావం తనపై ఉండదని తెలిపారు.కానీ, తన పిల్లలు రూహీ, యశ్‌ల పై ట్రోల్స్ చేస్తే బాధపడతానని పేర్కొన్నాడు.
ఇది ఇలా ఉంటే కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో కాఫీ విత్ కరణ్.

ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు ఈ షోలో పాల్గొన్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజా ఎపిసోడ్ లో ఎన్‌ఎమ్.నిహారిక, డానిష్ సైత్, తన్మయ్ భట్, కుషా కపిల పాల్గొన్నారు.వీరందరితో సరదాగా ముచ్చటించాడు కరణ్.ఈ నేపథ్యంలోనే ట్రోల్స్ గురించి స్పందించాడు.
కొనేళ్లుగా దృఢంగా ఉండటం నేర్చుకున్నాను.నిజం చెప్పాలంటే ఈ ట్రోల్స్ గురించి నేను పెద్దగా పట్టించుకోను.
అలాగే కామెంట్స్‌ను చదివినప్పటికి ఆలోచించను.కానీ, నా పిల్లలను దూషించినప్పుడు మాత్రం నాకు బాధగా అనిపిస్తుంది.
నా గురించి ఏం రాసినా, ఏం మాట్లాడినా దాని ప్రభావం నాపై ఉండదు అని కరణ్ జోహార్ తెలిపాడు.







