శ్రీను వైట్ల నిజస్వరూపం ఇదే.. షాకింగ్ కామెంట్లు చేసిన కోన వెంకట్!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన శ్రీనువైట్ల డైరెక్షన్లో తెరకెక్కిన సినిమాలలో ఈ మధ్య కాలంలో ఎక్కువ సినిమాలు సక్సెస్ ను సొంతం చేసుకోలేదు.

శ్రీనువైట్లకు కొత్త సినిమా ఆఫర్లు రావడం కూడా తేలిక కాదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

అయితే శ్రీనువైట్లతో కలిసి చాలా సినిమాలకు పని చేసిన కోనవెంకట్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.బాల్యం, విద్యాభ్యాసం కాకినాడలో జరిగిందని కోన వెంకట్ అన్నారు.

నా ఇద్దరు కూతుళ్లు విదేశాల్లో సెటిల్ అయ్యారని కోన వెంకట్ చెప్పుకొచ్చారు.నా పెద్ద కూతురు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుందని ఆయన తెలిపారు.

నేను ఒక కథ చెప్పగా ఆ కథ చరణ్ కు ఎంతగానో నచ్చిందని ఆ తర్వాత చరణ్ బ్రూస్ లీ కథ విన్నాడని అయితే నేను చెప్పిన కథ శ్రీనువైట్ల హ్యాండిల్ చేయలేడని భావించి నిర్ణయం మారిందని ఆయన తెలిపారు.ఆ కథ ఇప్పటికీ నా దగ్గర ఉందని ఆయన చెప్పుకొచ్చారు.

Advertisement

నటించడం పెద్ద టార్చర్ అని ఆయన పేర్కొన్నారు.సినిమా ఇండస్ట్రీలో శత్రుత్వం ఏ మాత్రం ఉపయోగపడదని ఆయన చెప్పుకొచ్చారు.

శ్రీనువైట్ల అంతా నేనే అంతా నేనే ని అనుకుంటారని కోన వెంకట్ కామెంట్లు చేశారు.నేను వర్క్ చేసినా పేరు వేయలేదని ఆ రీజన్ వల్లే విడిపోవాల్సి వచ్చిందని కోన వెంకట్ చెప్పుకొచ్చారు.

శ్రీనువైట్ల నేనే నేనే అనుకోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని కోన వెంకట్ తెలిపారు.కోనవెంకట్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కోన వెంకట్ తర్వాత ప్రాజెక్ట్ లతో సక్సెస్ లను అందుకుంటారో లేదో చూడాల్సి ఉంది.

కోన వెంకట్, శ్రీనువైట్ల కలిసి పని చేయాలని మరి కొందరు కోరుకుంటున్నారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు