వైరల్: ఐఫోన్ ను టెస్ట్ చేయాలని ఏకంగా కారుతో గుద్దాడు.. ఏం జరిగిందో తెలుసా?

పిచ్చి పలురకాలు అంటే ఇదే మరి.బేసిగ్గా మనం ఏదైనా వస్తువు కొనాలనుకుంటే, దాని గురించి రివ్యూలు చదువుతాము.

ముఖ్యంగా ఎక్కువ ధర కలిగిన స్మార్ట్‌ఫోన్ల గురించి, వాటి పనితీరు, అడ్వాన్స్‌డ్ ఫీచర్ల గురించి తెలుసుకోవడానికి కొంతమంది యూటూబర్లు చెప్పే రివ్యూలు కూడా చూస్తాం.అంతేగాని ఫోనుని తీసుకొని నేలమీద ఇసిరికొట్టి పరీక్షించి కొనలేము కదా.కానీ ఇక్కడ ఓ యూట్యూబర్ ఓ కొత్త ఐఫోన్ 14 ప్రోలో అందించిన ఒక ఫీచర్‌ను టెస్ట్ చేయడానికి అతడు ఏకంగా తన కారుతో యాక్సిడెంట్ చేయించాడు.ఏంటి ఆశ్చర్యపోతున్నారా? నిజమేనండి.కావాలంటే ఇక్కడ వున్న వీడియో చూడండి.

మీకే అర్ధం అవుతుంది.అవును, ఐఫోన్ 14 సిరీస్‌లో ఒక లేటెస్ట్ ఫీచర్ వచ్చింది.

కారు ప్రమాదాల సమయంలో బాధితులకు సాయం చేసే ‘క్రాష్ డిటెక్షన్’ ఫీచర్ అందులో ఉంది.ఐఫోన్ యూజర్లు కారు ప్రమాదానికి గురైతే, ఈ ఫీచర్ ఆటోమెటిక్‌గా ఆన్ అయ్యి.

Advertisement

ఎమర్జెన్సీ నెంబర్‌కు కాల్ చేస్తుంది.తద్వారా బాధితులను రక్షించే వీలు కలుగుతుంది.

అయితే ఈ ఫీచర్‌ను తాజాగా టెస్ట్ చేశాడు టెక్‌రాక్స్ ఛానెల్‌ యూట్యూబర్.

దీనికోసం అతగాడు ఏం చేసాడంటే, ఒక ఖాళీ ప్రదేశంలో పాడుబడిన వాహనాలను పెట్టి, వాటిని తన కారుతో స్పీడుగా ఢీకొట్టాడు.అయితే అతడు నేరుగా కాకుండా, రిమోర్ట్ కంట్రోల్‌తో ఆపరేట్ అయ్యే కారుతో ఈ ఫీచర్‌ను టెస్ట్ చేశాడు.ఇందుకోసం కారులో ఒక కెమెరాను కూడా బిగించాడు.

దాని ద్వారా ఐఫోన్ ఫీచర్‌ పనిచేస్తుందో లేదో తెలుసుకునేందుకు. డ్రైవర్ సీటు హెడ్‌రెస్ట్‌కు వెనుక భాగంలో ఐఫోన్‌ను కట్టేశాడు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

యూట్యూబర్ మొత్తం మూడుసార్లు తన కారుతో పాడుబడ్డ వాహనాలను ఢీకొట్టగా, ఆశ్చర్యంగా క్రాష్ డిటెక్షన్‌ ఫీచర్ ఆటోమెటిక్‌గా ఆన్ అయింది.

Advertisement

తాజా వార్తలు