ఈ ప్రకృతిలో ఎన్నో రకాల జీవులు ఉన్నాయి.రెండు విభిన్న జంతువుల మధ్య స్నేహం అనేది దాదాపు అసాధ్యం అని చెప్పవచ్చు.
అయితే జాతి వైరం మరికి కొన్ని జీవులు స్నేహం చేస్తుంటాయి.వాటి మధ్య స్నేహం ఎంతో చూడముచ్చటగా ఉంటుంది.
ముఖ్యంగా ఎప్పుడు కొట్టుకునే పిల్లి-ఎలుక, పిల్లి-కుక్క, కోతి-కుక్క వంటి జంతువుల మధ్య స్నేహం చిగురించిన వీడియోలు అందరినీ ఆకర్షిస్తాయి.వాటిని చూడగానే జాతివైరం మరిచి అవి ఎంతో స్నేహంగా కలిసి ఉన్నప్పుడు మనుషులలో ఎన్నో బేధాలు సృష్టించుకోవడం అనవసరం అని అనిపిస్తుంది.
ఇలాంటి వీడియోలు ఖచ్చితంగా కొందరి మనసులను మార్చుతాయి.తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఒంటెలను చూడగానే మనకు వాటి పొడవైన రూపం కళ్ల ముందు మెదులుతుంది.
ముఖ్యంగా ఎడారిలలో అవి ఎక్కువగా నివసిస్తాయి.భారీగా నీటిని తాగి, శరీరంలో నిల్వ చేసుకుని జీవిస్తుంటాయి.
ఎంత దూరమైనా ఎడారిలో అవి ప్రయాణించగలవు.అందుకే చాలా మంది ఎడారి ప్రాంతాలలో ఒంటెలనే తమ వాహనాలుగా చేసుకుంటుంటారు.
ముఖ్యంగా అరబ్ దేశాలలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి.తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ ఒంటె ఒక చిన్న కుక్క పిల్ల పట్ల ఎంతో ప్రేమను కురిపించింది.
ఆ చిన్న కుక్క పిల్ల భౌ భౌ అంటూ మొరిగి ఆ ఒంటె వద్దకు చేరుకుంటుంది.
వీడియో చూసి వారికి ఒంటెను కుక్క కరుస్తుందేమోననే భావం కలుగుతుంది.
కాసేపటికే అసలు విషయం అర్ధం అవుతుంది.కుక్క అరిచింది కరవడానికి కాదు.
ఆ ఒంటె ఆ కుక్క పిల్ల మనసులో భావం అర్ధం చేసుకుని, దాని వద్దకు వస్తుంది.ప్రేమగా తన పిల్లను నిమిరినట్లు తన తలతో కుక్ పిల్లను నిమురుతుంది.
దానిపై ఉన్న ప్రేమను ఆ విధంగా వ్యక్త పరుస్తుంది.అంతేకాకుండా దానికి ముద్దులు కూడా ఇస్తుంది.
ఆ కుక్క పిల్ల పట్ల ఒంటె చూపిన ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.రెండు విభిన్న జంతువుల మధ్య స్నేహం చూడడానికి చాలా బాగుందని కామెంట్లు పెడుతున్నారు.







