ప్రముఖ తమిళ స్టార్ హీరో అయినా శివ కార్తికేయన్ గురించి మనందరికీ తెలిసిందే.తమిళ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులకు కూడా శివ కార్తికేయన్ సుపరిచితమే.
ఇది ఇలా ఉంటే తాజాగా శివ కార్తికేయన్ ఒక వివాదంలో చిక్కుకున్నారు.కొరియన్ నటులపై ఆయన చేసిన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నాడు.
తాజాగా ఒక స్కూల్ ఫంక్షన్ లో పాల్గొన్న ఆయన ఒక కొరియన్ హీరో హీరోయిన్స్ లుక్స్ పై కామెంట్స్ చేశారు.శివ కార్తికేయన్ తాజాగా నటించిన చిత్రం డాన్.
ఈ సినిమాలో శివ కార్తికేయన్, సూరి ల మధ్య ఒక కామెడీ సన్నివేశం ఉంటుంది.అందులో ఈ ఇద్దరూ కొరియన్ స్లాంగ్‌ను ఇమిటేట్ చేస్తూ తమిళంలో మాట్లాడుకుంటారు.
అది అచ్చం కొరియన్ లాగా అనిపిస్తుంది.దీనిపై శివకార్తికేయన్ మాట్లాడుతూ.నాకు తెలిసిన కొరియన్ భాషంటే డాన్ సినిమాలో మాట్లాడిందే.నేను ఎప్పుడు కొరియన్ సినిమాలు చూసినా అందరూ ఒకేలా అనిపిస్తుంటారు.
కొన్ని సార్లు ఎవరు హీరో? ఎవరు హీరోయిన్?అన్నది తెలియకుండానే సినిమాలు చూశా.ఎప్పుడు కొరియన్ గురించి మాట్లాడినా కూడా నేను, సూరి అన్న మాట్లాడిన కొరియన్ నే గుర్తు కొస్తుంది.
కొరియా వాళ్లు ఎవరైనా ఇది విన్నారు అంటే టెన్షన్ పడతారు.డాన్ సినిమాలోని ఆ కామెడీ సీన్ కొరియన్ సినిమాలనుంచి వచ్చినదే అని తెలిపారు శివకార్తికేయన్.కామెడీ కోసం ఈ విధంగా మాట్లాడారు శివ కార్తికేయన్.

కాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ఈ వీడియోని చూసిన పలువురు నెటిజన్స్ కొందరు శివకార్తికేయన్‌పై ఫైర్ అవుతున్నారు.ఇతడు నిజంగా విషపూరితమైన వాడు.అతడి కామెడీ అంతా ఒకర్ని కించపరిచేలాగానే ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.100 ఏళ్ల తమిళ సినిమాను వెనక్కు నెట్టేస్తున్నాడు.సెలెబ్రిటీ లారా ఏదైనా మాట్లాడేటప్పుడు కొంత ఒళ్లు దగ్గరపెట్టుకోండి.మీ మాటలు, చేతలు కొందర్ని ఇబ్బంది పెట్టవచ్చు కామెంట్స్ చేస్తున్నారు.అలాగే పబ్లిక్ లో ఏ విధంగా మాట్లాడాలి అన్నది కూడా నేర్చుకోండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.







