గాడ్ ఫాదర్ మూవీ హక్కులను అమ్మవద్దని చెప్పిన చిరంజీవి.. ఏమైందంటే?

మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా వచ్చే నెల 5వ తేదీన థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే.

లూసిఫర్ రీమేక్ గా తెరకెక్కి భారీ అంచనాలతో విడుదలవుతున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ సినిమాను అడ్వాన్స్ ల మీద రిలీజ్ చేయాలని హక్కులను అమ్మవద్దని చిరంజీవి నిర్మాతలకు సూచించారని సమాచారం అందుతోంది.చిరంజీవి గత సినిమాలలో ఒకటైన సైరా నరసింహారెడ్డి సినిమాకు చరణ్ నిర్మాతగా వ్యవహరించగా ఈ సినిమాకు భారీ మొత్తంలో ఖర్చు కావడంతో నిర్మాతలకు నష్టాలు మిగిలాయనే సంగతి తెలిసిందే.

చిరంజీవి గత సినిమా ఆచార్య కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోవడం వల్ల బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది.ఆచార్య సినిమా వల్ల బయ్యర్లు భారీ మొత్తంలో నష్టపోయారు.

రీఎంట్రీ తర్వాత చిరంజీవి మార్కెట్ ఎంతనే ప్రశ్నకు సరైన సమాధానం దొరకడం లేదు.ఈ కారణం వల్లే గాడ్ ఫాదర్ సినిమాను అడ్వాన్స్ ల మీద రిలీజ్ చేయాలని మెగాస్టార్ అనుకుంటున్నారు.

Advertisement

సినిమా పరిమిత బడ్జెట్ తోనే తెరకెక్కిన నేపథ్యంలో లాభాలు వచ్చినా, నష్టాలు వచ్చినా ఆ బాధ్యత చిరంజీవి, నిర్మాతలు తేల్చుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.బయ్యర్ల నుంచి ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని భావించి చిరంజీవి ఈ తరహా నిర్ణయం తీసుకున్నారని బోగట్టా.గాడ్ ఫాదర్ లో ఎన్నో ప్రత్యేకతలు ఉండేలా చిరంజీవి జాగ్రత్తలు తీసుకున్నారనే సంగతి తెలిసిందే.

ఈ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి కోరుకున్న సక్సెస్ దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది.గాడ్ ఫాదర్ ప్రమోషన్స్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయి.చిరంజీవి రేంజ్ ను మరింత పెంచేలా ఈ సినిమా ఉండనుందని కామెంట్లు వినిపిస్తూ ఉండటం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు