అల్లు అర్జున్.. సుకుమార్ కాంబోలో సినిమా కంటే ముందుగా షార్ట్ ఫిలిమ్ వచ్చిందని మీకు తెలుసా?

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే.

వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మొట్టమొదటి చిత్రం ఆర్య.

ఈ సినిమా మంచి హిట్ కావడంతో ఈ సినిమాకి సీక్వెల్ గా ఆర్య 2 సినిమాని చేశారు.ఇక చాలా సంవత్సరాల తర్వాత సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చినటువంటి చిత్రం పుష్ప.

పాన్ ఇండియా స్థాయిలో తెరకేక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.ఇకపోతే తాజాగా ఈ సినిమా సీక్వెల్ చేయడానికి సుకుమార్ గట్టిగా ప్లాన్ చేశారు.

ఇక ఈ సినిమా సీక్వెల్ చిత్రాన్ని సెప్టెంబర్ 22వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభించనున్నట్లు సమాచారం.ఇక పుష్ప సినిమా మంచి హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.

Advertisement

ఇకపోతే డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో మొట్టమొదటిగా వచ్చిన చిత్రం.ఆర్య సినిమా కాదని ఈ సినిమా కంటే ముందుగా వీరిద్దరి కాంబినేషన్లో ఒక షార్ట్ ఫిలిం వచ్చిందని తెలుస్తోంది.

వీరి కాంబినేషన్లో వచ్చిన ఈ షార్ట్ ఫిలిం కేవలం మూడు నిమిషాల నిడివి మాత్రమే ఉందని ఈ షార్ట్ ఫిలిం కి అల్లు అర్జున్ నిర్మాతగా వ్యవహరించడం విశేషం.ఈ షార్ట్ ఫిలింలో మన కర్తవ్యాలు నిర్వర్తించడం కూడా దేశభక్తి అవుతుంది.మార్పు మనతోనే మొదలవుతుంది.

ఆ మార్పు నేనే అంటూ బన్నీ చెప్పిన డైలాగ్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.ఇలా సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో సినిమా కంటే షార్ట్ ఫిలిం వచ్చింది.

ఇక త్వరలోనే పుష్ప2 షూటింగ్ పనులతో అల్లు అర్జున్ బిజీ కానున్నారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు