టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి( Director Rajamouli ) గురించి మనందరికీ తెలిసిందే.రాజమౌళి ప్రస్తుతం వరుసగా సినిమాలను తెరకెక్కిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.
ఇక తెలుగులో మొదటిగా సినిమాల ట్రెండ్ మొదలుపెట్టింది రాజమౌళిఅన్న విషయం మనందరికీ తెలిసిందే.ఆయన ఏ ముహూర్తాన పాన్ ఇండియా సినిమాలోని మొదలుపెట్టారో కానీ అప్పటి నుంచి అందరి హీరోల దర్శకుల చూపు పాన్ ఇండియా సినిమాలో వైపే ఉంది.
చిన్నా, పెద్ద తేడా లేకుండా హీరోలంతా పాన్ ఇండియా వెంట పరుగులు తీస్తున్నారు.టాలీవుడ్ విషయానికి వస్తే.
ఎన్టీఆర్, రాంచరణ్, ప్రభాస్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, నిఖిల్ వంటి స్టార్లు పాన్ ఇండియా సినిమాలు చేసి దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నారు.కానీ ఇప్పటివరకు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )మాత్రం ఇంకా ఆ దిశగా అడుగులు వేయలేదు.అయితే అభిమానుల కోసం పాన్ ఇండియా మార్కెట్‌లోకి అడుగుపెడుతున్నారు పవన్.ఆయన లేటెస్ట్ మూవీస్ హరిహర వీరమల్లు( Harihara Veeramallu ), ఓజీలు పాన్ ఇండియా సినిమాలుగా రిలీజ్ కానున్నాయి.
దీనిలో మొదట హరిహర వీరమల్లు రిలీజయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.ఈ నేపథ్యంలో అభిమానులకు సర్‌ప్రైజ్ ఇస్తూ తాజాగా టీజర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
రెండు భాగాలుగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని మేకర్స్ ప్రకటించారు.హరిహర వీరమల్లు పార్ట్ 1 : స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ గా రాబోతోంది.17వ శతాబ్థంలో భారతదేశాన్ని మొఘల్ చక్రవర్తులు పరిపాలిస్తున్న కాలంలోకి ప్రేక్షకుడిని తీసుకెళ్లనున్నారు మేకర్స్.ఇందులో పవన్ బందిపోటుగా కనపించనున్నారు.అంటే పీరియాడికల్ మూవీ.వీటిని ప్రేక్షకులు బాగానే ఆదరిస్తుండటంతో మినిమమ్ గ్యారెంటీ అనే సెంటిమెంట్ నానాటికి బలపడుతోంది.దశాబ్ధాల నాడు ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఆసక్తి నేటి యువతలో ఉంటోంది.
అదే చిత్రయూనిట్‌కు కాసుల వర్షం కురిపిస్తోంది.రీసెంట్‌గా రిలీజైన ఆర్ఆర్ఆర్( RRR ), రజాకార్, హీరామండి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాగానే వర్కవుట్ అయ్యాయి.
ఈ సినిమాలలో వున్న కామన్ పాయింట్ భారత స్వాతంత్ర్య ఉద్యమం.ఆర్ఆర్ఆర్ తీసుకుంటే అల్లూరి సీతా రామరాజు, కొమురం భీంల క్యారెక్టర్ చుట్టూ సినిమా తిరుగుతుంది.
సహజంగానే దేశభక్తి , జాతీయవాదం ఇతివృత్తంగా తెరకెక్కిన సినిమాలకు సక్సెస్ రేటు ఎక్కువ.అయితే ఇప్పుడు ఇదే సూత్రాన్ని హరిహర వీరమల్లు ఫాలో అవుతున్నట్లుగా కనిపిస్తోంది.
స్వాతంత్య్రానికి పూర్వం నాటి నవాబుల పాలన , నాటి పరిస్ధితులు, ప్రజల స్థితిగతులను ఈ సినిమాలో టచ్ చేసినట్లుగా టీజర్‌ను బట్టి చెప్పవచ్చు.మరి హరిహరవీరమల్లు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో వేచి చూడాలి మరీ.