'RC16' సినిమాపై షాకింగ్ రూమర్స్.. మళ్ళీ ఇవేనా అంటూ..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇటీవలే రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.ఈ సినిమా ఘన విజయం అవడంతో వెంటనే అగ్ర డైరెక్టర్ శంకర్ తో తన నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేసాడు.

 Ram Charan Dropped Rc16 With Gowtham Tinnanuri-TeluguStop.com

మెగా ఫ్యాన్స్ అంతా ఆర్సీ 15 సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా మ్యూజిక్ డైరెక్టర్ గా ఎస్ ఎస్ థమన్ ను తీసుకున్నారు.

ఇక దిల్ రాజు ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.ఇక చరణ్ ఆర్సీ 15 తర్వాత గౌతమ్ తిన్ననూరి తో సినిమా చేయబోతున్నాడు.

ఈ విషయాన్నీ స్వయంగా యూవీ క్రియేషన్స్ వారు చరణ్ బర్త్ డే రోజు అధికారికంగా ఒక పోస్టర్ ద్వారా ప్రకటించారు.కానీ ఈ సినిమా ఆగిపోయింది అంటూ గత కొన్ని రోజులుగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి.

Telugu Shankar, Jersey, Ram Charan, Ramcharan, Ram Charan Rc, Rc-Movie

చరణ్ తన 16వ సినిమా విషయంలో ఇలా రూమర్స్ వస్తూనే ఉన్నాయి.

గతంలో ఈ సినిమా ఆగిపోయింది అంటూ వార్తలు వచ్చిన సమయంలో మెగా కాంపౌండ్ నుండి మాత్రం ఇవి రూమర్స్ మాత్రమే అని సమాచారం అందింది.అయితే ఇప్పుడు తాజాగా మళ్ళీ అదే రూమర్స్ వినిపిస్తున్నాయి.చరణ్ ఈయనను ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టారని వేరే డైరెక్టర్ తో సినిమాకు కమిట్ అవ్వబోతున్నారు అంటూ టాక్ బయటకు వచ్చింది.

మరి చూడాలి చరణ్ 16వ సినిమా ఎవరితో ఉండబోతుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube