వైరల్: సడెన్ గా తెగిపోయిన హైడ్రోజన్ బెలున్ తాడు.. గాల్లోనే 2 రోజులు గడిపాడు పాపం!

హైడ్రోజన్ బెలూన్ సహాయంతో పండ్లు కోస్తుండగా ఓ వ్యక్తి దాదాపు 2 రోజుల పాటు గాల్లోనే గడపాల్సి వచ్చింది.బెలున్ తాడు సడెన్ గా తెగిపోవడం వలన అతను వందలాది కిలోమీటర్లు బెలున్‌తో పాటు ప్రయాణించాడు.

 The Rope Of The Hydrogen Balloon Suddenly Broke It Is A Pity That He Spent 2 Da-TeluguStop.com

అదృష్టవశాత్తు ఎట్టకేలకు సురక్షితంగా కిందకు దిగాడు.ఈ షాకింగ్ ఘటన చైనాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే, ఈశాన్య చైనాలోని హీలాంగ్‌జియాంగ్ ప్రావిన్స్‌లోని ఓ అటవీ ఉద్యానవనంలో ఆదివారం ఈ ఘటన జరిగినట్టు భోగట్టా.హైడ్రోజన్ బెలున్ సహాయంతో 40 ఏళ్ళ వయస్సుగల ‘హు‘ పైన్ గింజలను సేకరిస్తున్నారు.

ఈ సమయంలో బెలూన్ తాడు ఆకస్మాత్తుగా తెగిపోయింది.కట్ చేస్తే, అతగాడు దానిలోనే చిక్కుకుపోయాడు.

అయితే అదే సమయంలో అదే బెలూన్ సహాయంతో బాధితుడికి సహాయం చేసిన వ్యక్తి కిందికి దూకేసాడు.ఆ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో బెలూన్ తోపాటు అదృశ్యమైన హు కోసం గాలించారు.

అయితే.అతని దగ్గర సెల్‌ఫోన్ ఉంది.మరుసటి రోజు సెల్‌ఫోన్ సిగ్నల్స్ కలవడంతో అధికారులు అతనిని సంప్రదించారు.హైడ్రోజన్‌ బెలూన్‌ సాయంతో చెట్టు నుంచి పైన్‌ కాయలు కోస్తుండగా.

ఉన్నట్టుండి దాని తాడు తెగిందని అధికారులు తెలిపారు.దాంతో అతగాడికి సురక్షితంగా ల్యాండ్ కావడానికి పలు సూచనలు చేశారు.

మొదట బెలూన్‌ నుంచి నెమ్మదిగా గాలిని తగ్గించమని చెప్పారు.వారి సలహాలతో హు.రష్యా సరిహద్దుకు దగ్గరగా ఉన్న ఫాంగ్‌జెంగ్ ప్రాంతంలో భూమి మీదకు చేరాడు.ఈశాన్య దిశగా 320 కిలోమీటర్లు (200 మైళ్లు) గాలిలో ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు.

అతను భూమిని చేరుకోవడానికి మరో రోజు పట్టిందన్నారు.అయితే.హు పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడని.గాలిలో నిలబడి ఉండటంతో వెన్నునొప్పితో కాస్త బాధపడుతున్నాడని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube