ఆ నాలుగేళ్లు నరకం చూశాను.. షాకింగ్ కామెంట్స్ చేసిన సుదీప!

చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండి తెరపై సందడి చేసి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు చైల్డ్ ఆర్టిస్ట్ సుదీప. ఈమెను సుదీప అంటే గుర్తుపట్టలేదేమో కానీ పింకీ అంటే మాత్రం టక్కున గుర్తుపడతారు.

 Bigg Boss 6 Contestant Sudeepa Shocking Comments About Her Love And Marriage Det-TeluguStop.com

వెంకటేష్ ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో పింకీ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించిన సుదీప పూర్తిగా పింకీ గానే అందరికీ గుర్తుండిపోయారు.ఇలా ఈ సినిమాతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అనంతరం పలు సినిమాలలో నటించి వెండితెరకు దూరమయ్యారు.

ఇలా వెండితెరకు దూరమైన ఈమె బుల్లితెర సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు.

ఇకపోతే గత కొంతకాలం నుంచి బుల్లితెర కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నటువంటి ఈమె తాజాగా తెలుగులో ప్రసారమవుతున్నటువంటి బిగ్ బాస్ సీజన్ 6 కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనే ముందు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుదీప తన గురించి పలు సక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా సుదీప మాట్లాడుతూ తాను శ్రీ రంగనాథ్ అనే ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో ప్రేమలో పడ్డానని తెలిపారు.

Telugu Aarti Agarwal, Biggboss, Child Artist, Naku Nachaav, Sudeepa, Sudeepa Pin

ఇలా నాలుగు సంవత్సరాలు పాటు తనతో ప్రేమలో ఉన్నానని అయితే తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పగా ఇంట్లో వాళ్ళు మా ప్రేమ కోప్పుకోలేదని తెలిపారు.ఇలా మా ప్రేమకు పెద్దవాళ్ళు ఒప్పుకోకపోవడమే కాకుండా తన ప్రేమ విషయం తెలిసినప్పటి నుంచి తనకు పెళ్లి సంబంధాలు తీసుకువస్తున్నారని అయితే నేను వాటిని రిజెక్ట్ చేయడంతో తనని బాగా తిట్టే వారంటూ ఈ సందర్భంగా తెలియజేశారు.ఇలా ప్రేమించిన వ్యక్తిని వదులుకోలేక కుటుంబాన్ని ఎదిరించలేక ఆ నాలుగు సంవత్సరాల పాటు నరకం అనుభవించానని, చివరికి తన ప్రేమను గెలిపించుకున్నానని ఈమె చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube