భార్య అందాన్ని పొగుడుతూ దుల్కర్ పోస్ట్.. నెటిజన్స్ ఫిదా?

తెలుగు సినీపేక్షకులకు హీరో దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మహానటి సినిమాతో తెలుగులో బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న దుల్కర్ సల్మాన్ ఇటీవల విడుదలైన సీతారామం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకొని మరింత పాపులరిటీని సంపాదించుకున్నాడు.

 Actor Dulquer Salmaan Birthday Wishes To His Wife Amal Sufiya, Dulqar Salman, Am-TeluguStop.com

ఈ సీతా రామం సినిమాతో దుల్కర్ సల్మాన్ అన్ని భాషల ప్రేక్షకులకు చేరువ అయ్యాడు.కాగా హను రాఘవపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

ఇందులో దుల్కర్ సల్మాన్ సరసన మృణాళ్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించింది.

ఇది ఇలా ఉంటే కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు చేరుగా ఉంటాడు దుల్కర్ సల్మాన్.

ఇక ఈయనకు తెలుగులో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలో ఈ ముందో మనందరికీ తెలిసిందే.అబ్బాయిలతో పోల్చుకుంటే అమ్మాయిలే ఎక్కువగా అభిమానులు ఉన్నారు అని చెప్పవచ్చు.

కాగా నేడు దుల్కర్ సల్మాన్ భార్య అమల్ సూఫియా పుట్టినరోజు సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌ లో ఓ పోస్ట్ పెట్టాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.

స్వీటెస్ట్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు.

మేమిద్దరం ఒక్కటై 12 సంవత్సరాలు పూర్తయింది.ఆ సమయం అంతా ఎక్కడికి పోయింది.? నేను ముసలోడిని అవుతున్నాను.నువ్వు మాత్రం ఇప్పటికీ అలానే ఉన్నావు.నేను చాలా దూరంగా ఉన్నప్పుడు ఇంటిని జాగ్రత్తగా చూసుకున్నందుకు ధన్యవాదాలు.ఇది నీకు బెస్ట్ బర్త్ డేగా నిలిచిపోతుందని ఆశిస్తున్నాను.పుట్టినరోజు శుభాకాంక్షలు.

నేను నిన్ను ప్రేమిస్తున్నాను.అని రాసుకొచ్చాడు దుల్కర్ సల్మాన్.

తన భార్యపై ఉన్న ప్రేమను సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడంతో అభిమానులు కూడా ఆయన భార్యకి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube