నూజివీడు వైసీపీ ఎమ్మెల్యేని నిలదీసిన టీడీపీ కార్యకర్తలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పథకాలు బాగానే అమలవుతున్నాగాని చాలా సమస్యలు ప్రజలను వేధిస్తూ ఉన్నాయి.ముఖ్యంగా రోడ్ల సమస్యతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 Tdp Workers Who Deposed Ycp Mla From Nuziveedu, Tdp, Ysrcp, Nuziveedu ,nuziveedu-TeluguStop.com

ఎక్కడపడితే అక్కడ గుంతలు కలిగిన ఈ రోడ్లపై తోలుతున్న వాహనాదారులు అనేకమంది అనారోగ్యాలకు గురి అవ్వుతూ నడుము నొప్పులతో బాధపడుతూ.ప్రమాదాలకు గురవుతున్నారు.

రోడ్లు విషయంలో వైసీపీ ప్రభుత్వం ఇదిగో అదిగో అంటున్న గాని సమస్య మాత్రం అలాగనే ఉంటుంది.ఇటువంటి తరుణంలో “గడపగడపకు మన ప్రభుత్వం” కార్యక్రమం పేరిట వెళుతున్న వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజలనుండి తీవ్రస్థాయిలో వ్యతిరేక స్వరం వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

దీనిలో భాగంగా తాజాగా నూజివీడు వైసిపి ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్ అప్పారావు ముసునూరు మండలం గొల్లపూడి గ్రామంలో “గడపగడపకు మన ప్రభుత్వం” చేపట్టిన క్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుండి ఊహించని షాక్ ఎదురైంది.వైసీపీ అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని రోడ్లు చాలా దారుణంగా అధ్వానంగా ఉన్నాయని.

టీడీపీ నేతలు ఎమ్మెల్యే ని ప్రశ్నించడం జరిగింది.ఈ పరిణామంతో రెండు పార్టీలకు చెందిన నాయకులు ఘర్షణకు దిగారు.

అందరి ముందు ఎమ్మెల్యేని ప్రశ్నించడంతో.అధికార పార్టీకి చెందిన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే సమక్షంలోనే రెండు పార్టీలకు చెందిన నాయకులు గొడవ పడటం జరిగింది.ఒక నూజివీడులోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల విషయంలో వైసీపీ ప్రభుత్వంపై ప్రజల నుండి తీవ్ర స్థాయిలో వ్యతిరేక స్వరం వినిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube