తెలంగాణలో బిజెపి బలోపేతం చేయడంతో పాటు ,టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యంను ఎత్తిచూపేందుకు, జనాల్లో బిజెపికి ఆదరణ పెంచేందుకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ వ్యాప్తంగా ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్నారు.ఈ యాత్రకు ప్రజా స్పందన ఎక్కువగా వస్తుండడం తో పాటు, కేంద్ర బీజేపీ పెద్దల ప్రశంసలు సంజయ్ కు దక్కుతున్నాయి.
ఒకవైపు మునుగోడు లో ఉప ఎన్నికల రాజకీయం జరుగుతున్న గాని, సంజయ్ తన పాదయాత్రను కొనసాగిస్తూ టిఆర్ఎస్ నేతలపై విరుచుకుపడుతూనే ఉన్నారు.అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేసీఆర్ కుమార్తె కవిత పేరు బయటకు రావడం తో , సంజయ్ మరింత దూకుడు పెంచగా, ఆయనను పోలీసులు అరెస్ట్ చేయడంతో రెండు రోజులుగా సంజయ్ పాదయాత్ర నిలిచిపోయింది.
ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం పాదయాత్ర ముగింపు సభను ఈనెల 27వ తేదీన హనుమకొండలో నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు.అయితే ఇప్పుడు ఆ సభను నిర్వహించేందుకు అనుకూల పరిస్థితులు లేకపోవడం, ఆ సమయం దగ్గరకు వచ్చేస్తుండడంతో బిజెపి శ్రేణులో టెన్షన్ పెరిగిపోతుంది.
గత కొద్ది రజులుగా బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజాసంఘం యాత్రకు ఎన్నో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.అడుగడుగునా ఆయనకు నిరసనలు ఆందోళనలు , దాడులు ఎదురవుతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలోని జనగామ జిల్లాలో సంజీవ్ పాదయాత్రకు బ్రేక్ పడింది ఈనెల రెండున యాదాద్రిలో ప్రారంభమైన సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఈనెల 27న వరంగల్ లోని భద్రకాళి అమ్మవారి సన్నిధిలో ముగియాల్సి ఉంది.19 రోజులు పాటు సాగిన పాదయాత్ర జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం పాంనూరు కు చేరింది.ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రవేశించినప్పటి నుంచి పాదయాత్ర అటు బిజెపి ఇటు టిఆర్ఎస్ కు టెన్షన్ పుట్టిస్తూనే ఉంది.

ఈ పాదయాత్ర ఇలా సాగుతున్న సమయంలోనే ఢిల్లీ లిక్కర్ స్కాం బయటకు రావడంతో హైదరాబాదులో ఎమ్మెల్సీ కవిత ఇంటి ముట్టడికి సంజయ్ పిలుపునివ్వడం, ఈ సందర్భంగా బిజెపి కార్యకర్తలపై టీఆర్ఎస్ శ్రేణులు దాడు చేయడంతో పాటు , హత్యాయత్నం కేసులు నమోదు చేయడంపై బండి సంజయ్ ఆగ్రహంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనకు పిలుపునిచ్చారు.పాదయాత్ర శిబిరం వద్ద దీక్షకు దిగగా సంజయ్ పదేపదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ,ఆయనకు నోటీసు జారీ చేసి పాదయాత్ర అనుమతిని రద్దు చేయడంతో పాటు, స్టేషన్ ఘన్పూర్ పీఎస్ లో కేసు కూడా నమోదు చేశారు .ఈ అక్రమ కేసులు నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి శ్రేణులు నిరసన దీక్షలు చేపడుతున్నాయి.ఈ నేపథ్యంలో బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈనెల 27న భారీ బహిరంగ సభ నిర్వహించాల్సి ఉన్నా, ఇది జరగడం అనుమానంగానే ఉంది.
బిజెపి హౌస్ మోషన్ పిటిషన్ హైకోర్టు తిరస్కరించడంతో, నిన్న లంచ్ మోషన్ పిటిషన్ ను స్వీకరించి ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది.ఎందుకు పాదయాత్ర ఆపాలో కారణాలు చెప్పాలని విచారణను నేటికి వాయిదా వేసింది.
షరతుల తో కూడిన అనుమతులు లభిస్తాయని బిజెపి భావిస్తుండగా, పోలీసులు మాత్రం పాదయాత్ర జరిగితే ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడతాయని, శాంతిభద్రతల సమస్యలు ఏర్పడతాయని, కోర్టుకు తెలిపే అవకాశం ఉంది.ఈ నేపథ్యంలో కోర్టు ఇచ్చే తీర్పు ఆధారంగానే 27న పాదయాత్ర ముగింపు సభ జరుగుతుందా లేదా అనేది ఒక క్లారిటీ వస్తుంది.







