స్పందన కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ చేపట్టి.
విద్య, వైద్యంలో నాడు – నేడు పనుల ప్రగతిపై చర్చించారు.స్పందన కార్యక్రమంలో వస్తున్న ఫిర్యాదులు, వాటి పరిష్కారం, పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలో ఉపాధి హమీ పనుల సగటు వేతనం రూ.240 ఉండేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల నిర్వహణపై పర్యవేక్షణ ఉండాలని చెప్పారు.
అదేవిధంగా అసంపూర్తిగా ఉన్న ఆర్బీకేలు, సచివాలయాలు, హెల్త్ క్లినిక్స్ అక్టోబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.అక్టోబర్ 2 నాటికి గ్రామాల్లో జగనన్న భూహక్కు, భూ రక్ష సర్వే పూర్తి కావాలని.
అనంతరం ప్రతి నెలలోనూ వేయి గ్రామాల్లో సర్వే పూర్తి చేసి పత్రాలు అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.







