అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాజకీయంగా కీలక విజయం సాధించారు.బైడెన్ యంత్రాంగం తీసుకొచ్చిన వాతావరణం, పన్ను, ఆరోగ్య సంరక్షణ ప్రణాళికకు సంబంధించిన బిల్లును శుక్రవారం అమెరికా కాంగ్రెస్ ఆమోదించింది.
ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ టై బ్రేక్ ఓటు వేయడంతో సెనేట్‌లో ఈ బిల్లు ఆమోదం పొందగా.ఆ వెంటనే ప్రతినిధుల సభలో సునాయసంగా బిల్లు పాసయ్యింది.2030 నాటికి అమెరికాలో గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను 40 శాతం తగ్గించే లక్ష్యంతో 370 బిలియన్ డాలర్ల పెట్టుబడికి సంబంధించిన తన ప్రణాళికను బైడెన్ గతంలోనే ప్రకటించారు.
ఈ బిల్లు ఆమోదం పొందిన వెంటనే బైడెన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.
‘‘నేడు అమెరికన్ ప్రజలు గెలిచారు’’ అంటూ ట్వీట్ చేశారు.ద్రవ్యోల్బణం తగ్గింపు చట్టం ఆమోదం పొందడంతో .ఇకపై కుటుంబాలు తక్కువ ప్రిస్క్రిప్షన్ మందుల ధరలు, తక్కువ ఆరోగ్య సంరక్షణ ఖర్చులను చూస్తాయి.వచ్చే వారం చట్టంగా సంతకం చేయడానికి నేను ఎదురుచూస్తున్నానని బైడెన్ ట్వీట్లో పేర్కొన్నారు.
నవంబర్‌లో జరిగే కీలకమైన మధ్యంతర ఎన్నికలకు మూడు నెలల ముందు , కాంగ్రెస్‌పై డెమొక్రాటిక్ పార్టీ నియంత్రణతో పాటు బైడెన్ తన అగ్ర విధాన ప్రాధాన్యతలలో ఒకదానిపై ఇది స్పష్టమైన విజయంగా అమెరికన్ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.కార్బన్ ఉద్గారాలను తగ్గించే పోరాటంలో అమెరికా నాయకత్వాన్ని పునరుద్ధరించడంలో ఈ బిల్లు సహాయపడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.