గుర్రాల కళ్లకు గంతలు కట్టడానికి ఇదే కారణమా..?

కళ్లకు గంతలు కట్టిన గుర్రాలను మీరందరూ ఇప్పటికే చూసే ఉంటారు.అయితే వీటి కళ్లకు ఎందుకు గంతలు కడతారో చాలామందికి తెలియకపోవచ్చు.

 Is This The Reason For Blindfolding Horses Horse, Cloths, Tie, Viral Latest, New-TeluguStop.com

ఇప్పుడు దానికి గల కారణాలు గురించి మనం తెలుసుకుందాం.సాధారణంగా గుర్రాలకు మూడు కారణాల వల్ల కళ్లకు గంతలు కడతారు.

అందులో మొదటి కారణం వాటి కళ్లను ఈగల వంటి కీటకాల నుంచి కాపాడేందుకు.రెండోది గుర్రాలకు తమ కళ్లతో దాదాపు 350 డిగ్రీలు చూసేలా ఒక మోనోక్యులర్ దృష్టి ఉంటుంది.

అంటే గుర్రం తన ఒక కన్నుతో 350 డిగ్రీలు కోణంలో తన చుట్టూ ఉన్న అన్ని దృశ్యాలను చూడగలదు.మనిషి మాత్రం 45 డిగ్రీలు పరిధిలో ఉన్న దృశ్యాలను మాత్రమే చూడగలుగుతారు.

అయితే ఈ గుర్రం రెండు కళ్లతో కేవలం 65 డిగ్రీల కోణంలో మాత్రమే చూడగలుగుతుంది.ఒక కన్నుతో అయితే అది 350 డిగ్రీల కోణాల్లో చూస్తుంది కానీ రెండు కళ్ల విషయానికొస్తేనే వీటి చూపు తగ్గుతుంది.

అయినా కూడా అవి మనుషుల కంటే మంచిగానే చూడగలవు.అయితే అవి ఒక కన్నుతో ఎక్కువ దృశ్యాలను చూడగలవు కాబట్టి వాటి ఫోకస్ అంతా ముందు దారిపై కాకుండా పక్కన ఉన్న ఇతర వాటిపై పడుతుంది.

పరిగెత్తేటప్పుడు ఇలా పక్కనుంచి ఏదైనా వస్తే వాటికి స్పష్టంగా కనిపిస్తుంది.అప్పుడు అవి బెదురుతాయి.

మనుషులకు మాత్రం అలా జరగదు.అందుకే పక్కనుంచి ఏదైనా వస్తున్న మనం పట్టించుకోకుండా ముందుకు వెళ్దాం.

కానీ గుర్రాలు భయపడి పోతాయి.అడవిలో పుట్టి పెరిగే ఈ గుర్రాలు వేటాడే జంతువులు పక్క నుంచి వస్తే వెంటనే భయపడిపోయి ఎలా పడితే అలా ఉరుకుతాయి.

మనిషి రైడ్ చేస్తున్నప్పుడు ఇలా పరిగెడితే చాలా ప్రమాదం.అందుకే గుర్రం దృష్టిని కేవలం ముందు దారిపై మాత్రమే కేంద్రీకరించేందుకు కళ్లకు గంతలు కడతారు.

ఈ గంతలు అనేవి పారదర్శకంగా ఉండొచ్చు లేదా పూర్తిగా ఏమీ కనిపించకుండా ఉండొచ్చు.ఏమీ కనిపించకుండా ఉన్నప్పుడు ఆ గుర్రం అనేది తన యజమానిపై పూర్తి నమ్మకం ఉంచి పరిగెడుతుంది.

Telugu Horse, Latest-Latest News - Telugu

హార్స్ రేస్‌లో వెనక వచ్చే గుర్రాలను కూడా ఈ గుర్రాలు చూడగలుగుతాయి.అందుకే వెనక వచ్చే గుర్రాలను, స్టేడియంలో కూర్చొని అరిచి, గోల చేసే ప్రేక్షకులను ఇవి చూడకుండా కేవలం ముందు దారిపై మాత్రమే ఫోకస్ పెట్టేలా కళ్లకు గంతలు కడతారు.మూడో కారణం ఇవి ముందుకెళ్లడానికి బాగా భయపడి పోయినప్పుడు కళ్లకు గంతలు కట్టారు.ఈ గంతలు కట్టినప్పుడు గుర్రాలకు ఏమీ కనిపించదు.ఉదాహరణకు ముందు ఏదైనా అగ్నిప్రమాదం జరిగి ఉంటే ఆ రోడ్డుపై నుంచి వెళ్లేందుకు గుర్రాలు అస్సలు ధైర్యం చేయవు.అలాంటప్పుడు వాటి కళ్ళకు గంతలు కట్టి రైడర్లు వాటిని ముందుకు తీసుకువెళ్తారు.

ఇంకా చెప్పుకుంటూపోతే గుర్రాల చూపు ఇతర జంతువులతో పోలిస్తే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube