బాలీవుడ్ బ్యూటీ సారా ఖాన్ గురించి మనందరికీ తెలిసిందే. హిందీ రియాల్టీ షో అయిన లాకప్ షో తో మంచి గుర్తింపు తెచ్చుకుంది సారా ఖాన్.
ఈమె నటిగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.కాగా ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ప్రేమలో మునిగి తేలుతోందట.
థానేకు చెందిన పైలట్ శాంతను రాజేతో డేటింగ్ చేస్తోందట.అయితే వీరికి సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడి ఆ తరువాత కొంతకాలానికే మంచి ఫ్రెండ్స్‌గా మారారు.
అలా ఆ తర్వాత వారిద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడగా అది కాస్తా ప్రేమకు దారి తీసింది.
అలా చాలా రోజులుగా ప్రేమలో మునిగితేలుతున్నారు ఈ జంట.ఏడాదిగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఈ లవ్‌బర్డ్స్ ఇటీవలే ఈద్ పండగను సైతం కలిసి సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా వీళ్లిద్దరూ త్వరలో మోహిత్ చౌహన్ పాడిన మ్యూజిక్ ఆల్బమ్‌లో జంటగా కనిపించనున్నారు.
కాగా ఇదే విషయాన్ని శాంతను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.గత కొద్ది నెలలుగా ఫొటోలను షేర్ చేస్తూ మురిసిపోతున్న వీరిద్దరూ త్వరలోనే తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా వెల్లడించనున్నట్లు సమాచారం.

కాగా సారా ఖాన్ లాకప్ షోలో ఉన్నప్పుడు శివం శర్మ ఆమెకు ప్రపోజ్ చేశాడు.కానీ ఆమె మాత్రం ఆ ప్రపోజ్‌ను నిర్మొహమాటంగా తిరస్కరించిందట.తను ఆల్‌రెడీ లవ్‌లో ఉండటం వల్లే శివం శర్మ ప్రేమను అంగీకరించలేదంటున్నారు నెటిజన్స్.విరిద్దరు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేయగా ఆ ఫోటోలను చూసిన అభిమానులు వావ్ సూపర్ అంటూ కామెంట్లు కూడా చేస్తూ ఉంటారు.







