ప్రధానమంత్రి నరేంద్రమోదీ హత్యకు పన్నిన కుట్రను బీహార్ పోలీసులు భగ్నం చేశారు.పాట్నాలో మోదీని హత్యగావించేందుకు కుట్ర పన్నిన ముగ్గరు అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు.2047 నాటికి భారత్‌ను ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.జూలై 12న మోదీ బీహార్ పర్యటన సందర్భంగా ఆయన్ను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు వెల్లడించారు.
అరెస్టయిన వారిలో జార్ఖండ్ రిటైర్డ్ పోలీసు అధికారి మహ్మద్ జల్లావుద్దీన్, అథార్ పర్వేజ్ ఉన్నారని ఎస్ ఎస్ పీ మనీశ్ కుమార్ తెలిపారు.వీరికి పీఎఫ్‌ఐతో లింకులు ఉన్నట్లు గుర్తించారు.
అనుమానిత ఉగ్రవాదులు ప్రధాని పర్యటనకు 15 రోజుల ముందు పాట్నాలోని పుల్వారీ షరీఫ్‌లో శిక్షణ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.జూలై 6, 7 తేదీల్లో మోదీ టార్గెట్‌గా వ్యూహాలు రూపొందించినట్లు పోలీసులు తెలిపారు.
ఉగ్రవాదులు ఆశ్రయం పొందిన ఫుల్వారీ షరీఫ్ లోని కార్యాలయంలో బీహార్ పోలీసులు దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో పోలీసులు పలు రహస్య డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
వాటిలోని ఒక దాంట్లో 2047 వరకెల్లా ఇండియాను ఇస్లామిక్ ఇండియాగా మార్చాలని ఉంది.వీటితోపాటు 25 పీఎఫ్‌ఐ కరపత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో 26మందిపై ఎఫ్ ఐఆర్ నమోదు చేసినట్టు పాట్నా ఎస్ ఎస్ పీ తెలిపారు.

పాట్నాలోని ఫుల్వారీ షరీఫ్ ప్రాంతంలో ఉగ్రవాద కదిలకలు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరోకి సమాచారం అందింది.దాంతో పోలీసులు, కేంద్ర ఏజెన్సీలు జూలై 11న నయాతోలా ప్రాంతంలో దాడి చేసి అనుమానిత ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు.అరెస్టయిన వీరిద్దరూ పాకిస్థాన్, బంగ్లాదేశ్, టర్కీతో సహా పలు ఇస్లామిక్ దేశాల నుంచి నిధులు పొందేవారని దర్యాప్తులో వెల్లడైంది.
ఈ కుట్రకు సంబంధించిన దర్యాప్తులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ ఐఏ కూడా పాలుపంచుకున్నది.







