టాలీవుడ్ దర్శకుడు వేణు శ్రీరామ్ గురించి మన అందరికి తెలిసిందే.మొదట ఓ మై ఫ్రెండ్ సినిమాతో దశకుడిగా పరిచయమైన వేణు శ్రీరామ్ ఆ తర్వాత నానితో కలిసి ఏం సి ఏ సినిమాను చేసి మంచి టాక్ ను అందుకున్నాడు.
అలాగే పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా సొంతం చేసుకున్న విషయం తెలుస్తుంది.వేణు శ్రీరామ్ చివరిగా తీసిన వకీల్ సాబ్ సినిమా వచ్చి దాదాపుగా నెలలు గడిచి పోతున్నా ఇంత వరకు వేణు శ్రీరామ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయలేదు.
కాగా పవన్ కళ్యాణ్ వంటి స్టార్ తో మూవీ చేసి కూడా ఖాళీగా ఉండట మేంటని అందరూ ఆశ్చర్య పోయారు.
అయితే నిజానికి అప్పట్లో ఆగిపోయిన ఐకాన్ చిత్రాన్ని తిరిగి బన్నీ తో సెట్స్ మీదకు తీసుకురావాలని ప్రయత్నాలు చేసారు వేణు శ్రీరామ్.
అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోసం ఎదురు చూసిన దర్శక నిర్మాతలకు నిరాశే ఎదురైనట్లు సమాచారం.పుష్ప తర్వాత అమాంతం క్రేజ్ పెరగడంతో అల్లు అర్జున్ ఆలోచనలో మార్పు వచ్చిందని టైర్ 2 డైరెక్టర్స్ తో వర్క్ చేయడానికి పెద్దగా ఆసక్తి కనబరచడం లేదని అంటున్నారు.
కాగా ఒకవేళ ఇదే నిజమైతే ఐకాన్ పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఈ సినిమా కోసం వేణు శ్రీరామ్ చాలా కాలం వర్క్ చేశారనీ దిల్ రాజు కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.మరి కొన్నాళ్ళు వేచి చూసి అది ఎప్పటికైనా బన్నీ తో చేస్తారా లేదా వేరే హీరోతో ముందుకు వెళ్తారా? లేదా పూర్తిగా పక్కన పెట్టేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.కాగా అల్లు అర్జున్ ఇటీవలే పాన్ ఇండియా పుష్ప సినిమాతో ఒకసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు అల్లు అర్జున్.






