america’s Richest Self-Made Women List : భారత సంతతి మహిళా సీఈవోకి చోటు.. ఎవరీ జయశ్రీ ఉల్లాల్..!!

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికాకు వలస వెళ్లిన భారతీయులు అక్కడ అత్యున్నత స్థానంలో నిలుస్తున్న సంగతి తెలిసిందే.

పురుషులతో పాటు మహిళలు కూడా తామేం తక్కువ కాదని నిరూపిస్తున్నారు.

గత కొన్ని దశాబ్ధాలుగా భారతీయ మహిళలు ఎఫ్ఎంసీజీ, సాయుధ దళాలు, ఐటీ, బ్యాంకింగ్ రంగాలలోకి పెద్ద ఎత్తున ప్రవేశిస్తున్నారు.భారతీయ మహిళల సామాజిక, ఆర్ధిక స్థితిలో మెరుగుదల ఉన్నప్పటికీ.

వారు ఆయా రంగాల్లో సీనియర్, టాప్ మేనేజ్‌మెంట్‌కు చేరుకోవడం, సెల్ఫ్ మేడ్ బిలియనీర్లు కావడం అన్నది మాత్రం చాలా తక్కువ.అయితే తమను తాము నిరూపించుకున్న వారిలో కంప్యూటర్ నెట్‌వర్కింగ్ సంస్థ అయిన అరిస్టా నెట్‌వర్క్స్ ప్రెసిడెంట్, సీఈవో జయశ్రీ ఉల్లాల్ ఒకరుఫోర్బ్స్ ఇటీవల ప్రకటించిన అమెరికాలోనే అత్యంత సంపన్నులైన సెల్ఫ్ మేడ్ మహిళల జాబితాలో ఉల్లాల్ చోటు దక్కించుకున్నారు.1.9 బిలియన్ డాలర్ల నికర సంపదతో .అలాగే అరిస్టా స్టాక్‌లో 5 శాతం వాటాలను ఆమె కలిగి వున్నారు.

లండన్‌లో పుట్టి భారత్ లో పెరిగిన ఉల్లాల్ కాన్వెంట్ ఆఫ్ జీసస్ అండ్ మేరీ స్కూల్ లో చదువుకున్నారు.శాన్‌ఫ్రాన్స్‌స్కో స్టేట్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, శాంటా క్లారా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ మేనేజ్‌మెంట్‌ పట్టా పొందారు.అనంతరం ఒక దశాబ్ధ కాలంగా అరిస్టా ప్రెసిడెంట్, సీఈవోగా జయశ్రీ ఉల్లాల్ క్లౌడ్ నెట్‌వర్కింగ్‌లో అరిస్టా వ్యాపారానికి నాయకత్వానికి వహిస్తున్నారు.

Advertisement

ఫోర్స్బ్ జాబితాలో జయశ్రీ ఉల్లాల్ 15వ స్థానంలో నిలిచారు.ఆమె నాయకత్వంలో కంపెనీ జూన్ 2014లో ఐపీవోకి వెళ్లింది.గతంలో జయశ్రీ సిస్కోలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్, డేటా సెంటర్, స్విచ్చింగ్ అండ్ సర్వీసెస్ లో పలు హోదాల్లో పనిచేశారు.2018 ఆగస్ట్‌లో సిస్కోతో ఎన్నో ఏళ్లుగా వున్న పేటెంట్ ఉల్లంఘన వివాదాన్ని జయశ్రీ పరిష్కరించారు.ఈ క్రమంలో 400 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు ఆమె అంగీకరించారు.

నెట్‌వర్కింగ్‌లో దాదాపు 30 ఏళ్లకు పైగా అనుభవం ఉల్లాల్ కు వుంది.ఈ రంగంలో చేసిన సేవలకు గాను.2015లో Entrepreneur of the Yearగాను, 2018లో “World’s Best CEOs" జాబితాలోనూ, 2019లో ఫార్చ్యూన్ టాప్ 20 బిజినెస్ పర్సన్స్ లిస్ట్‌లోనూ జయశ్రీ ఉల్లాల్ చోటు సంపాదించారు.

Advertisement

తాజా వార్తలు