బాలయ్య కెరీర్ లో ఎంతోమంది దర్శకులు.. కానీ ఆ ముగ్గురు ఎంతో ప్రత్యేకం.. ఎందుకంటే?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అన్న విషయం తెలిసిందే.

బాలయ్య సినిమా విడుదల అయింది అంటే చాలు అటు మాస్ ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు వచ్చేస్తూ ఉంటాయి.

ఇక బాలకృష్ణ చెప్పే ఒక్కో పవర్ ఫుల్ డైలాగ్ కి మాస్ ప్రేక్షకులను ఈలలు గోలలతో రెచ్చి పోతూ ఉండడంతో థియేటర్ల దద్దరిల్లి పోతాయి అని చెప్పాలి.అయితే ఇప్పటి వరకు 106 సినిమాల్లో నటించిన బాలకృష్ణ కెరియర్ లో ముగ్గురు దర్శకులు మాత్రం ఎంతో ప్రత్యేకం.

ఇక ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.బాలయ్య సినీ కెరీర్ స్టార్టింగ్ లో ఓ దర్శకుడు బాలకృష్ణను హీరోగా నిలబెడితే ఇక ఆ తర్వాత కాలంలో సూపర్ హిట్లు అందించి బాలయ్యను స్టార్ హీరోగా మార్చేసాడు మరో దర్శకుడు.ఐదు పదుల వయస్సు దాటిన తర్వాత కూడా బాలయ్య కు సూపర్ హిట్ లు అందించి ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు ఇంకో దర్శకుడు.1984లో బాలకృష్ణ హీరోగా నటించిన మంగమ్మగారి మనవడు సినిమా కమర్షియల్గా సూపర్హిట్ అయింది.కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

ఇక వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ముద్దుల కృష్ణయ్య, మువ్వగోపాలుడు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు అని చెప్పాలి.దీంతో బాలయ్య కెరీర్ లో హాట్రిక్ దర్శకుడిగా మారిపోయాడు కోడి రామకృష్ణ.

Advertisement

ఆ తర్వాత యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు బి.గోపాల్ సైతం బాలయ్యకు ఇలాంటి హ్యాట్రిక్ అందించాడు.లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి సినిమాలు వీరి కాంబినేషన్లో వచ్చి బాక్సాఫీసును షేక్ చేశాయి.

అదే సమయంలో ఇక బాలయ్య కెరియర్ లో మరో ప్రత్యేకమైన దర్శకుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు బోయపాటి.సింహ, లెజెండ్, అఖండ సినిమాతో వీరి కాంబినేషన్ హ్యాట్రిక్ కొట్టేసింది.

ఇలా బాలయ్య కెరీర్ లో ఎంతో మంది దర్శకులు ఉన్నా ఈ ముగ్గురు మాత్రం అటు అభిమానులకు మరోవైపు బాలయ్యకు ఎప్పటికీ ప్రత్యేకం అని చెప్పాలి.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు