పంజాబీ ప్రవాసులకు సీఎం గుడ్‌న్యూస్.. ఢిల్లీ ఇందిరా గాంధీ విమానాశ్రయానికి ఇక ప్రభుత్వ బస్సులు

పంజాబ్ నుంచి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో స్థిరపడ్డ పంజాబీలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.రాష్ట్రం నుంచి ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తున్న ఎన్ఆర్ఐలను ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు నిలువు దోపిడి చేస్తున్నారు.

 Punjab Govt Buses To Delhi's Igi Airport From June 15 Bhagwant Mann , Punjab, Bh-TeluguStop.com

దీనిపై దృష్టిసారించిన ప్రభుత్వం.పంజాబ్‌లోని పలు ప్రాంతాల నుంచి ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బస్సులను ప్రారంభించనున్నట్లు తెలిపింది.

ఈ మేరకు జూన్ 15 నుంచి ఈ సర్వీసులు ప్రారంభమవుతాయని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తెలిపారు.ప్రయాణీకులు తమకు నచ్చిన బస్సును ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చని ప్రభుత్వం సూచించింది.

ప్రయోగాత్మకంగా 20 వోల్వో బస్సులను ఇందిరా గాంధీ విమానాశ్రయానికి నడుపుతామని భగవంత్ మాన్ పేర్కొన్నారు.ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా వీటి సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ 20 సర్వీసుల్లో నాలుగింటిని ఒక్క చండీగఢ్‌కే కేటాయించడం విశేషం.

Telugu Bhagwant Mann, Punjabbhagwant, Hoshiarpur, Indiragandhi, Jalandhar, Lodhi

గడిచిన నాలుగేళ్లుగా పంజాబ్ నుంచి ఇందిరా గాంధీ విమానాశ్రయానికి ప్రైవేట్ ఆపరేటర్లు మాత్రమే బస్సులు నడుపుతున్నారు.వీటిలో రాజకీయ కుటుంబాలకు చెందిన కంపెనీలే ఎక్కువ.అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ప్రైవేట్ ఆపరేటర్ల గుత్తాధిపత్యాన్ని విచ్ఛిన్నం చేస్తామని ఆప్ హామీ ఇచ్చింది.

పీఆర్టీసీ, పీయూఎన్‌బస్, పీఈపీఎస్‌యూలు వసూలు చేసే టారీఫ్‌లు ప్రైవేట్ ఆపరేటర్ల కంటే తక్కువగా వుంటాయని భగవంత్ మాన్ తెలిపారు.ఈ బస్సులు చండీగఢ్‌తో పాటు అమృత్‌సర్, పటాన్‌కోట్, జలంధర్, లూథియానా, హోషియార్‌పూర్, కపుర్తలా, పటియాలా మధ్య తిరుగుతాయని సీఎం వెల్లడించారు.ప్రైవేట్ ఆపరేటర్లు ఇందుకోసం రూ.2,500 వసూలు చేయగా.ప్రభుత్వం మాత్రం రూ.830, రూ.1,390లకే సేవలు అందిస్తుందని భగవంత్ మాన్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube