యూజర్లకు జియో బంపరాఫర్.. సరికొత్త ప్రీప్రెయిడ్‌ ప్లాన్లతో ఎన్నో ప్రయోజనాలు!

ప్రీప్రెయిడ్ కస్టమర్లంతా ఒకే ఆలోచన కలిగి ఉండరు.వారికి అవసరమైన ప్లాన్లను రోజుల వ్యవధి, ధర, ఆఫర్లు, డేటా పరిమితి వంటివి పరిగణనలోకి తీసుకుంటారు.

 Reliance Jio Offers To Users With Latest Prepaid Plans Details, Jio, Pre Paid,pl-TeluguStop.com

వారి అభిరుచికి అనుగుణంగా ‘జియో’ చక్కటి ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తోంది.అవి చూడగానే చాలా మంది తమకు నచ్చిన, అనువైన ప్లాన్లను ఎంచుకుంటారు.

వారికి కళ్లు చెదిరే ఆఫర్లతో కూడిన 6 ప్లాన్లను అందిస్తోంది.జియో టీవీ, జియోసినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ లాంటి యాప్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా పొందొచ్చు.

ఇతర యాప్స్‌ కూడా నిర్ణీత కాలం పాటు ఉచితంగా ఆనందించొచ్చు.వాటికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

రూ.499 జియో రీఛార్జ్ ప్లాన్:

రిలయన్స్ జియో నుండి రూ.499 రీఛార్జ్ ప్లాన్‌కు 28 రోజుల వ్యవధి.రోజుకు 2GB హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను అందిస్తుంది.

ఈ ప్లాన్ ద్వారా లోకల్, STD మరియు నేషనల్ రోమింగ్‌పై అపరిమిత వాయిస్ కాల్‌లు, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు చేసుకోవచ్చు.ఈ ప్లాన్ ఎంచుకున్న కస్టమర్లు ఏడాది గడువుతో కూడిన డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందొచ్చు.

రూ.2999 జియో రీఛార్జ్ ప్లాన్:

ఈ ప్లాన్ వ్యవధి 365 రోజులు.రోజుకు 2.5GB డేటాను అందిస్తుంది.ఈ ప్యాక్ రీఛార్జ్ ఎంచుకున్న వారు డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా ఒక సంవత్సరం ఆనందించొచ్చు.ఈ ప్లాన్ అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా పొందొచ్చు.

Telugu Jio Recharge, Jio, Latest, Benifits, Pre Paid, Reliancejio-General-Telugu

రూ.719 జియో రీఛార్జ్ ప్లాన్:

84 రోజుల వ్యవధి ఉండే ఈ ప్లాన్ రీచార్జ్ చేయించుకుంటే రోజుకు 2జీబీ డేటా వినియోగించుకోవచ్చు.లోకల్, ఎస్‌టీడీ, నేషనల్ రోమింగ్‌పై అపరిమిత వాయిస్ కాల్‌లు పొందొచ్చు.అంతేకాకుండా రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు అదనం.

రూ.299 జియో రీఛార్జ్ ప్లాన్:

ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌తో రోజుకు 2 జీబీ డేటా పొందొచ్చు.అంటే మొత్తం మీరు 56 జీబీ డేటా పొందొచ్చు.28 రోజుల వ్యవధి ఉంటుంది.ఈ ప్లాన్‌తో అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి.

Telugu Jio Recharge, Jio, Latest, Benifits, Pre Paid, Reliancejio-General-Telugu

రూ.666 జియో రీఛార్జ్ ప్లాన్:

ప్రీపెయిడ్ ప్లాన్ కొన్ని ఆసక్తికరమైన ప్రయోజనాలు ఉన్నాయి.మీరు మొత్తం 84 రోజుల పాటు రోజుకు 1.5 జీబీ చొప్పున మొత్తం 126 జీబీ డేటాను పొందుతారు.అంతేకాకుండా ఈ ప్యాక్‌తో అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా వినియోగించుకోవచ్చు.

రూ.333 జియో రీఛార్జ్ ప్లాన్:

కొత్త జియో ప్లాన్ 28 రోజుల వాలిడిటీ.రోజుకు 1.5GB డేటాను అందిస్తుంది.అంటే మీరు మొత్తం 42 జీబీ డేటాను పొందుతారు.ప్యాక్‌తో అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను కూడా అందిస్తుంది.అంతే కాకుండా 3 నెలల పాటు డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ పొందొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube