సాధారణంగా ఒక్కోసారి మెడ నల్లగా మారిపోతుంటుంది.ఎండల ప్రభావం, డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోవడం, ఒంట్లో అధిక వేడి, మెడను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వంటి రకరకాల కారణాల వల్ల మెడ నల్లగా మారి అసహ్యంగా కనిపిస్తుంటుంది.
దాంతో మెడ నలుపును వదిలించుకోవడం కోసం నానా ప్రయత్నాలు చేస్తుంటారు.ఇరుగు పొరుగు వారు చెప్పిన చిట్కాలన్నీ ప్రయత్నిస్తుంటారు.
అయినప్పటికీ ఫలితం లేకుంటే ఏం చేయాలో తెలియక తెగ మదన పడిపోతూ ఉంటాయి.
ఈ లిస్ట్‌లో మీరు ఉన్నారా.? అయితే అస్సలు చింతించకండి.ఎందుకంటే, ఇప్పుడు చెప్పబోయే సూపర్ రెమెడీని ట్రై చేస్తే చాలా సులభంగా మెడ నలుపు నుంచి బయట పడొచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సూపర్ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండీ.ముందుగా ఒక బీట్ రూట్‌ను తీసుకుని పీల్ తొలగించి నీటిలో శుభ్రంగా కడగాలి.ఇలా కడిగిన బీట్ రూట్‌ను మెత్తగా పేస్ట్ చేసి జ్యూస్‌ను సపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ పెసర పిండి, వన్ టేబుల్ స్పూన్ జొన్న రవ్వ, వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ అలోవెర జెల్, వన్ టేబుల్ స్పూన్ తేనె మరియు బీట్ రూట్ జ్యూస్ వేసుకుని అన్నీ కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని మెడకు అప్లై చేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
ఆపై మునివేళ్లతో మృదువుగా రుద్దుకుంటూ వాటర్‌తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఈ సింపుల్ అండ్ ఎఫెక్టివ్ రెమెడీని రోజుకు ఒకసారి ప్రయత్నిస్తే.కేవలం వారం రోజుల్లోనే నలుపు వదిలిపోయి మెడ తెల్లగా, కాంతివంతంగా మరియు కోమలంగా మారుతుంది.