ఈ టీలు తాగితే స‌హ‌జంగానే హై బీపీ కంట్రోల్ అవుతుంద‌ట‌!

హై బీపీ(అధిక ర‌క్త‌పోటు).ఇటీవ‌ల రోజుల్లో ఎంద‌రినో చాలా కామ‌న్‌గా వేధిస్తున్న స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి.

 These Tea S Help To Control High Blood Pressure Naturally , High Blood Pressure,-TeluguStop.com

హై బీపీని హైప‌ర్ టెన్ష‌న్ అని కూడా పిలుస్తారు.ఒత్తిడి, ఆహార‌పు అల‌వాట్లు, ఓవ‌ర్‌గా మ‌ద్యం తీసుకోవ‌డం, ధూమ‌పానం, మారిన జీవ‌న శైలి, అధిక బ‌రువు, ఉప్పును ప‌రిమితికి మించి తీసుకోవ‌డం, నిద్ర‌ను నిర్ల‌క్ష్యం చేయ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల ర‌క్త‌పోటు స్థాయిలు పెరిగిపోతుంటాయి.

దాన్నే హై బీపీ అంటారు.ఆ స‌మ‌స్య‌ను ఏ మాత్రం నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌దు.

పొర‌పాటున నిర్ల‌క్ష్యం చేశారా.తీవ్రమైన గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, మెద‌డు యొక్క‌ ర‌క్త‌నాళాల్లో ఇబ్బందులు వచ్చే అవకాశాలు భారీగా పెరిగిపోతాయి.అందుకే వీలైనంత త్వ‌ర‌గా పెరిగిన ర‌క్త‌పోటు స్థాయిల‌ను అదుపులోకి తెచ్చుకునేందుకు ప్ర‌య‌త్నించాలి.అయితే అందుకు ఇప్పుడు చెప్ప‌బోయే టీలు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ టీలు ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.

మందారం టీ.

హై బీపీని స‌హ‌జంగానే కంట్రోల్ చేసే సామ‌ర్థ్యం దీనికి పుష్క‌లంగా ఉంటుంది.రోజుకు ఒక క‌ప్పు మందారం టీని సేవిస్తే పెరిగిన ర‌క్త‌పోటు స్థాయిలు చాలా త్వ‌ర‌గా అదుపులోకి వ‌స్తాయి.

అదే స‌మ‌యంలో వెయిట్ లాస్ అవుతారు, గుండె జ‌బ్బులు ద‌రి చేర‌కుండా ఉంటాయి.లివ‌ర్ శుభ్రం అవుతుంది.

మూత్రపిండాల్లో రాళ్లు క‌రుగుతాయి.కాబ‌ట్టి, హై బీపీ ఉన్న వారే కాదు ఎవ్వ‌రైనా మందారం టీని తీసుకోవ‌చ్చు.

Telugu Pressure, Garlic Tea, Tips, Hibiscus Tea, Bp, Latest-Telugu Health Tips

అలాగే హైబ్లడ్ ప్రెజర్ ను తగ్గించడంలో వెల్లుల్లి టీ ఒక స‌హ‌జ సిద్ధ‌మైన మెడిసిన్‌లా ప‌ని చేస్తుంది.వెల్లుల్లి టీని రెగ్యుల‌ర్ డైట్‌లో చేర్చుకుంటే ర‌క్త‌పోటు చ‌క్క‌గా కంట్రోల్‌లోకి వ‌స్తుంది.శ‌రీరంలో క్యాన్స‌ర్ క‌ణాలు వృద్ధి చెంద‌కుండా ఉంటాయి.రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌ల‌ప‌డుతుంది.ఒత్తిడి, ఆందోళ‌న‌, డిప్రెష‌న్ వంటి స‌మ‌స్య‌లు ఉంటే దూరం అవుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube