ఎమ్మెస్ రాజు.ఈ నిర్మాత పేరు చెప్పగానే ఎన్నో సినిమాలు కళ్ల ముందు కదలాడుతూ ఉంటాయి.
ఇక విలువలతో కూడిన సినిమాలను నిర్మించడం లో ఎప్పుడు ఎమ్మెస్ రాజు ముందు ఉంటారు అని చెప్పాలి.ఇప్పటివరకు ఎన్నో మంచి సినిమాలతో ప్రేక్షకులను అలరించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.
ఇక ఇప్పుడు అటు తెలుగు ఇండస్ట్రీలో ఒక పెద్దగా కూడా కొనసాగుతున్నారు నిర్మాత ఎమ్మెస్ రాజు.కానీ ఇప్పుడు ఎమ్మెస్ రాజు గారికి ఏమైంది అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలో మెదులుతూ ఉంటుంది.
గతమంతా ఎంతో విలువలతో సినిమాలు తీసిన ఆయన ఇప్పుడు మాత్రం ఎందుకు బూతు వెంట పరుగులు పెడుతున్నారు అంటూ కొంతమంది చర్చించుకుంటున్నారట.
అయితే నిర్మాత ఎమ్మెస్ రాజు గురించి ఇలా అనుకోవడం వెనుక పెద్ద కారణమే ఉంది.
అప్పుడు మనసంతా నువ్వే, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి లాంటి మంచి విలువలున్న సినిమాలను నిర్మించిన ఆయన ఎంతగానో గౌరవం కూడా సంపాదించుకున్నారు.ఇలా ఆయన కెరీర్ మొత్తం ఎంతో అద్భుతంగా సాగిపోయింది.
కానీ ఇప్పుడు మాత్రం నాలుగు రాళ్లు సంపాదించుకోవడానికి బూతు వెంటపడుతున్నారు అని తెలుస్తోంది.దర్శకుడిగా మారి దర్టీ హరి అనే ఒక బుతూ సినిమా తీసి హిట్ కొట్టారు.
అయితే ఈ సినిమాలో కేవలం బోల్డ్ మాత్రమే ఉంది అనుకుంటే పొరపాటే.మనిషిలో అంతర్గతంగా ఇంకొక మనిషి దాగి ఉంటాడు అనే కాన్సెప్ట్ ఈ సినిమాలో ఉంటుంది.
కానీ ఈ సినిమా నిండా ప్రతి సన్నివేశం కూడా బోల్డ్ సీన్సే.

ఇక ఈ సినిమాతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన నిర్మాత ఎమ్మెస్ రాజు ఇక ఇప్పుడు మరో బూతు సినిమాకు శ్రీకారం చుట్టారు.ఇక రాజుగారు హద్దులు మీరిన ఓల్డ్ సన్నివేశాలతో దర్శకుడిగా అవసరానికి మించి మాస్ మసాల తో ప్రేక్షకులను ఆకర్షించేసి హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే సెవెన్ డేస్ సిక్స్ నైట్స్ అంటూ ఒక సినిమా వదిలితే అది కూడా బాగానే డబ్బులు చేసుకుంది.
ఇప్పుడు సతి అనే ఒక సినిమా అనౌన్స్ చేశారు.ఏ సినిమాలో మాత్రం ఇప్పటి వరకు ఆయన తెరకెక్కించిన సినిమాలకు మించి బోల్డ్ సన్నివేశాలు ఉండబోతున్నాయని టాక్ వినిపిస్తోంది.
అందుకే రాజు గారికి ఏమైంది అంటూ అందరూ చర్చించుకుంటున్నారు.








