చేతికొచ్చిన మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతి

ఖమ్మం జిల్లా బోనకల్ మండలం గోవిందాపురం(ఎల్) లో చేతికొచ్చిన మొక్కజొన్న పంట అగ్నిప్రమాదంతో బూడిదయ్యింది.గోవిందాపురానికి చెందిన రజక సంఘం జిల్లా అధ్యక్షుడు తమ్మారపు బ్రహ్మయ్య తన ఎకరంతో పాటు మరో రెండకరాలు కౌలుకు తీసుకొని మొక్కజొన్న సాగుచేశాడు.

 Hand-picked Corn Crop Burns To The Ground-TeluguStop.com

పంట పెట్టుబడికి అరవైవేల రూపాయలు ఖర్చయినట్టు రైతు తెలిపాడు.పంట చేతికొచ్చే సమయానికి అగ్నికి ఆహుతి కావటంతో బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

సుమారు లక్షరూపాయల వరకు పంట నష్టం జరిగినట్టు రైతు బ్రహ్మం తెలిపాడు.అయితే అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనేదానిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగిందా లేక గుర్తి తెలియని వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారా అనేదానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube