స్టేడియంలోనే యువకుడికి లవ్ ప్రపోజ్ చేసిన యువతి.. వీడియో వైరల్!

ఐపీఎల్‌లో ఒక్కోసారి ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి.ముఖ్యంగా ప్రేమికులు కోట్లాది మంది చూస్తుండగా ప్రపోజల్ చేసుకునేందుకు క్రికెట్ స్టేడియంను ఎంపిక చేసుకుంటారు.

తాజాగా అలాంటి మరో సంఘటన ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుండగా వెలుగు చూసింది.ఒక యువతి ఆర్‌సీబీ జెర్సీ ధరించిన తన ప్రియుడికి స్టేడియంలోనే ప్రపోజ్ చేసింది.

ఈ బ్యూటిఫుల్ సీన్ ని కెమెరా మ్యాన్ క్యాప్చర్ చేశాడు.ప్రపోజల్ సన్నివేశం స్టేడియంలో పెద్ద స్క్రీన్ పై కనిపించడంతో క్రికెటర్లతో సహా ఆడియన్స్ ఈ జంట వైపు చూశారు.

అయితే అమ్మాయి ప్రపోజల్ కు అబ్బాయి ఓకే చెప్పడంతో అందరూ చప్పట్లు, ఈలలతో హోరెత్తించారు.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది.

Advertisement

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.వైరల్ అవుతున్న వీడియోలో ఆర్‌సీబీ జెర్సీలో ఉన్న ఒక అబ్బాయిని చూడొచ్చు.

ఈ యువకుడు ముందు ఓ యువతి మోకాళ్లపై వంగి రింగ్ చూపిస్తూ ప్రపోజ్ చేయడం కూడా చూడొచ్చు.దీంతో బాగా ఎమోషనల్ అయిన ఆ యువకుడు ఆ అమ్మాయి ప్రేమను అంగీకరించాడు.అనంతరం వారిద్దరూ ఆప్యాయంగా కౌగిలించుకున్నారు.

ఈ దృశ్యాలన్నీ కెమెరా మ్యాన్ లైవ్‌లో చూపించాడు.ఇది చూసిన క్రికెటర్లు ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

దీనికి సంబంధించిన వీడియో యూట్యూబ్, ఫేస్ బుక్, ట్విట్టర్‌లో షేర్ వైరల్ గా మారింది.ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు