ఇద్దరు దొంగలు దొరికారు

నల్లగొండ జిల్లా:దొంగతనం కేసులో ఇద్దరు నిందితులను మిర్యాలగూడ పోలీసులు అరెస్టు చేశారు.వీరి వద్ద నుండి సుమారు రూ.

13 లక్షల విలువ చేసే 23 తులాల బంగారం,730 గ్రాముల వెండి,రూ.12,000 నగదును స్వాధీనం చేసుకుని, అరెస్ట్ చేసిన నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టారు.ఈ సందర్భంగా నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరి,డీఎస్పీ వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ శనివారం ఉదయం 11.00 గంటల సమయంలో మిర్యాలగూడ 1 టౌన్ కు చెందిన పోలీసులు ఎస్ఐ సుధీర్ కుమార్,పిసి బి.రాజు,హోం గార్డ్ యం.డి ఖాజా రాజీవ్ చౌరస్తా నందు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు టిఎస్ 05 ఎఫ్ఎం 2283 నెంబరుగా కలిగిన స్కూటీపై అనుమాస్పదంగా కనిపించడంతో ఆపి తనిఖీ చేసినట్లు తెలిపారు.సీటు క్రింద బంగారు హారం -1, ఉంగరాలు -3 లభించడంతో ఆ ఆభరణాల గురించి వారిని అడుగగా వారు తడబడుతూ పారిపోయే ప్రయత్నం చేయగా వారిని అదుపులోకి తీసుకొని విచారించగా వారు మిర్యాలగూడ హౌసింగ్ బోర్డుకు చెందిన పెయింటర్ కొత్తపల్లి మధు,ఆటో డ్రైవర్ శాగంటి మహేశ్ గా తెలిసిందన్నారు.

ఇద్దరు నిందితులు చేసే పనిలో వచ్చే డబ్బులు సరిపోక దొంగతనాలు చేయుటకు నిర్ణయిచుకున్నామని చెప్పారన్నారు.నవంబర్ -2021 సంవత్సరం నుంచి మిర్యాలగూడ -1 టౌన్,2 టౌన్,రూరల్ మరియు వాడపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో గల ఏరియాలలో పగలు మరియు రాత్రి సమయాలలో బయటి నుంచి తాళము వేసిన ఇండ్లనే లక్ష్యంగా చేసుకుని సుమారు 15 ఇళ్ళను బైక్ పై వెళ్ళి,ఇంట్లోకి దూరి,తమతో తీసుకువెళ్లిన ఇనుప రాడ్డుతో ఇంటి తలుపుల తాళాలు పగులగొట్టి,ఇంట్లోకి వెళ్ళి ఆ ఇండ్లలో ఉండే బంగారు మరియు వెండి ఆభరణాలతో పాటు దొరికినంతా డబ్బును దొంగలించుకుని వెళ్లిపోతామని ఒప్పుకున్నట్లు పేర్కొన్నారు.

వీరిపై మిర్యాలగూడ -1 టౌన్ పరిధిలో 8 కేసులు,మిర్యాలగూడ -2 టౌన్ పరిధిలో 1 కేసు,మిర్యాలగూడ - రూరల్ పరిధిలో 5 కేసులు,వాడపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో 1 కేసు నమోదు కాబడినట్లు తెలిపారు.వీరి వద్ద 23 తులాల బంగారం,730 గ్రాముల వెండి ఆభరణాలలు సుమారు 13 లక్షల విలువతో పాటు,రూ.12,000 / - స్కూటీ స్వాధీనం చేసుకున్నామన్నారు.మిర్యాలగూడ డిఎస్పి వై.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కేసును ఛేదించిన సిఐ శ్రీనివాస్ మిర్యాలగూడ -1 టౌన్ ఎస్ఐ బి.సుధీర్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ పి.వెంకటేశ్వర్లు,పిసిలు ఎన్.నాగరాజు,కె.రవి,కె.

వెంకటేశ్వర్లును జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి అభినందించారు.

Advertisement
మండుతున్న ఎండలు..వందేళ్ల రికార్డు బ్రేక్...!

Latest Nalgonda News