2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది అంటే ఖచ్చితంగా దాని వెనుక రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కష్టం చాలావరకు ఉందనే విషయం వైసిపి నాయకులు ఒప్పుకుంటారు. వైసీపీ రాజకీయ ప్రధాన ప్రత్యర్థి అయిన టిడిపిని ముప్పుతిప్పలు పెట్టి వైసీపీ అధికారంలోకి వచ్చే విధంగా రాజకీయ వ్యూహాలను ప్రశాంత్ కిషోర్ వైసీపీ ద్వారా అమలు చేశారు.ఆ ఫలితమే 2019 ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది.151 స్థానాలతో వైసిపి అఖండ మెజారిటీని సాధించగా, టిడిపి కేవలం 23 స్థానాలకు పరిమితం అయిపోయింది.దీంట్లో జగన్ కష్టం ఎక్కువగా ఉన్నా ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాలు బాగా పనిచేయడం మరో కారణం.ఇదిలా ఉంటే 2024 ఎన్నికల్లో వైసీపీకి రాజకీయ వ్యూహాలు ప్రశాంత్ కిషోర్ అందిస్తారని జగన్ కొద్ది నెలల క్రితం ప్రకటించారు.
ఈ మేరకు ఆయనకు చెందిన ప్యాక్ టీం కూడా రంగం లోకి దిగింది.అయితే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం వైసీపీ నాయకుల్లోనూ ఆందోళన కలిగిస్తోంది. ప్రశాంత్ కిషోర్ సేవలకు ముగింపు పలికి సొంతంగానే ఏపీలో అధికారంలోకి మళ్లీ వచ్చేందుకు జగనే ఇప్పుడు రాజకీయ వ్యూహకర్త గా మారాలని నిర్ణయించుకున్నారు.175 నియోజకవర్గాల్లోనూ వైసిపి గెలవాలని జగన్ లక్ష్యంగా నిర్ణయించుకున్నారు.అయితే ప్రశాంత్ కిషోర్ నేరుగా రాజకీయ వ్యూహాలు అందించక పోయినా, ఆయనకు చెందిన ఐ బ్యాక్ టీమ్ మాత్రమే ఇప్పుడు వైసీపీ తరఫున పనిచేయబోతోంది.ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్షంగా వైసీపీ కోసం పని చేయక పోవడానికి కారణాలు చాలా ఉన్నాయట.
కొద్ది రోజుల క్రితం వరకు ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరిగింది.అలాగే రాజకీయ వ్యూహ కర్తలుగానూ సేవలు అందించబోతున్నారు అనే సంకేతాలు వెలుబడ్డాయి.
కానీ ఆ నిర్ణయాన్ని ఆయన మార్చుకున్నారు.ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీకి వ్యూహకర్తగా ఆయన పనిచేస్తున్నారు.

అటు టిఆర్ఎస్ తో పాటు , మిగిలిన రాష్ట్రాల్లోనూ ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాలు అందిస్తుండడం, బీజేపీ వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తుండడంతో ఏపీలోనూ ఆయన సేవలు కొనసాగిస్తే రాజకీయంగా భవిష్యత్తులో ఇబ్బందులు ఏర్పడతాయని ఉద్దేశంతో జగన్ ప్రశాంత్ కిషోర్ పక్కన పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.ప్రశాంత్ కిషోర్ నేరుగా పని చేయకపోయినా, ఆయనకు చెందిన ఐ ప్యాక్ టీం సహాయంతో 175 నియోజక వర్గాలను జగన్ టార్గెట్ గా పెట్టుకున్నారు.గతంలో పీకే అమలు చేసిన వ్యూహాలను మళ్లీ అమలు చేస్తూ క్షేత్రస్థాయిలో నాయకులతో పర్యటనలు చేయిస్తూ మళ్లీ తిరుగులేని విజయాన్ని సాధించాలని జగన్ పట్టుదలగా ఉన్నారు.ప్రస్తుతం ఏపీలో జగన్ పరిపాలన పై జనాల్లో ఆశించినంత స్థాయిలో సానుకూలత లేదు .ఇటువంటి సమయంలో పీకే వంటి వారిని దూరం చేసుకుని జగన్ రిస్క్ చేస్తున్నారా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.







