ముస్లిం సోదరసోదరీమణుల ఐక్యతకు ప్రతీక రంజాన్ పర్వదినం అని తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.ఖమ్మం నగరంలోని ఖిల్లాలో జరిగిన ఇఫ్తార్ వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ముస్లిం సోదరులతో ప్రత్యేక ప్రార్థనల అనంతరం జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొని ముస్లిం సోదరులకు ఖజూర తినిపించి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ నెలరోజుల పాటు ఉపవాస దీక్షలు అత్యంత కఠోరంగా చేపట్టి చివరిరోజు నెలవంక కనిపించాకా రంజాన్ పర్వదినాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో పవిత్రంగా జరుపుకుంటారని తెలిపారు.
చిన్న పెద్ద అనే తేడాలేకుండా ప్రతి ముస్లిం ఈ ఉపవాస దీక్షలో భాగసామ్యం అవ్వడం విశేషమన్నారు.ఇఫ్తార్ విందు వేడుకలో మాజీ ఎంపీ పొంగులేటితో పాటు కార్పోరేటర్లు దొడ్డా నగేష్, మలీదు జగన్, కొప్పెర ఉపేందర్, మైనార్టీ నాయకులు శౌకత్, అక్రం, షేక్ హిమామ్, ఎంపీపీ మధు, భీమనాధుల అశోక్ రెడ్డి, దుందల రవికుమార్, తోట ప్రసాద్, చల్లా కృష్ణారెడ్డి, చింతమళ్ళ గురుమూర్తి, తంబీ, కాంపాటి రమేష్, మొగిలిచర్ల సైదులు, నర్సింహారావు, యువనేత గోపి తదిదరులు పాల్గొన్నారు







