మూడోసారి టీఆర్ఎస్ కు ఈ రాష్ట్రం లో చాన్స్ లేదు.. వి హనుమంతరావు

టీఆర్ఎస్ ప్రభుత్వం రెండవ సారి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో రేప్ లు మర్డర్ లు చేయడం బాగా పెరిగాయని సినియర్‌ కాంగ్రేస్‌ నేత వి హానుమంతరావు అన్నారు.

ఖమ్మం నగరంలోని కాంగ్రేస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అజయ్ కుమార్ కింద స్థాయి కార్యకర్తల మీద కేసులు పెట్టి వేదించటం మంచిది కాదన్నారు.

ముఖ్యమంత్రేమో ఫ్రేండ్లీ పోలీస్ అంటాడు వాళ్ళు కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి వేదిస్తారు ఎక్కడుంది ఫ్రేండ్లీ పోలీస్.‌ అజయ్ కుమార్ నీ హవా నడవది ఇక ఎనిమి విత్ పీపుల్ అవుతున్నది పోలీసు.

మూడోసారి టీఆర్ఎస్ కు ఈ రాష్ట్రం లో చాన్స్ లేదు.కక్ష్య సాదింపు మంచిది కాదు కేటీఆర్, కాంగ్రేస్ పార్టీ నేషనల్ పార్టీ సెక్యులర్ పార్టీ బీజేపీతో మేం పొత్తు ఎప్పటికీ పెట్టుకోం.

ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం దౌర్జన్యం చేస్తే ఊరుకోం.రాహుల్ గాంది గారు మే అరవ తేదీన వరంగల్ ల్లో బహిరంగ సభకు వస్తున్నారని తెలిపారు.

Advertisement
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

తాజా వార్తలు