ఈ రోజుల్లో వధువులు తమ పెళ్లి రోజున డ్యాన్స్‌లు వేయడం, పాటలు పాడటం, అలాగే చిలిపి పనులు చేయడం మెయిన్ ట్రెండ్ గా మారిపోయింది.కొందరు అయితే ఎవరూ ఊహించని పనులు చేసి మరీ అందరినీ నవ్విస్తూ ఉన్నారు.
అయితే తాజాగా ఒక వధువు మాత్రం తన కండలు చూపిస్తూ అందర్నీ ఆశ్చర్య పరిచింది.అంతేకాదు ఈ పెళ్లి కూతురు వెడ్డింగ్ డ్రెస్ లో పుషప్స్ చేసి వావ్ అనిపించింది.
దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.
ఈ వీడియో ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
ఫిట్‌నెస్ విత్ ఎ డిఫరెన్స్.లెహంగా, ఆభరణాలతో పుష్-అప్‌లు చేస్తున్న వధువు.” అని ఈ వీడియోకి ఓ క్యాప్షన్ జోడించారు.వైరల్ అవుతున్న వీడియోలో రెడ్ కలర్ వెడ్డింగ్ లెహంగా కట్టుకున్న ఒక నవ వధువు పుష్ అప్స్ చేయడం చూడొచ్చు.
ఆ తర్వాత ఆమె తన మజిల్స్ కూడా షో చేసింది.

ఈ వీడియోకి 5 వేల కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి.కొంతమంది నెటిజన్లు ఆమె ఫిట్‌నెస్‌ను పొగుడుతున్నారు.కొందరు మాత్రం ఇదేందయ్యా ఇది అని అవాక్కవుతున్నారు వధువులు డ్యాన్స్ చేయడం చూశాం కానీ , ఇది చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే భారీ వెడ్డింగ్ లెహంగాలో వ్యాయామం చేయడం చాలా కష్టం, ముఖ్యంగా పుష్-అప్‌లను చేయడం అసాధ్యం అని ఒక యూజర్ కామెంట్ చేశాడు.
గత సంవత్సరం, మరొక వధూవరులు గురుగ్రామ్‌లో ఫిట్‌నెస్ పట్ల తమ ప్రేమను చాటడానికి వేదికపై పుష్-అప్‌లు చేసి వార్తల్లో నిలిచారు.లేటెస్ట్ వీడియో ని మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.







