అసలైన రైతు బాంధవుడు మన కేసీఆర్: ధాన్యం కొనుగోలు సంబరాల్లో మంత్రి పువ్వాడ అజయ్

తెలంగాణ రైతులు పండించిన మొత్తం యాసంగి వడ్లను కొంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడాన్ని హర్షిస్తూ ఖమ్మం జిల్లా కేంద్రంలోని మంత్రి పువ్వాడ క్యాంపు కార్యాలయంలో రైతులతో కలిసి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కేసీఅర్ చిత్రపటానికి పాలభిషేకం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ మాట్లడుతూ.

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులను నట్టేట ముంచాలని చూస్తే సీఎం కేసీఆర్ ప్రతి గింజలు తామే ఉంటామని ప్రకటించి మరోసారి రైతు పక్షపాతి అని నిరూపించారన్నారు.ఇవాళ్టి నుండి రాష్ట్రంలో రైతు పండించిన ప్రతి గింజ ప్రభుత్వమే కొనుగోలు చేయనుందని, అందుకు ఏర్పాట్ల ప్రారంభమయ్యాయని తెలిపారు.

మధ్య దళారులకు సంబంధం లేకుండా కనీస మద్దతూ ధర ఇచ్చి ప్రభుత్వమే కొంటుందన్నారు.ఇందుకోసం ప్రభుత్వంపై పదిహేను వేల కోట్లు ప్రభుత్వనికి భారం పడనుందని అయినప్పటికీ రైతుల కొసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని, వారి నిర్ణయం పట్ల రైతులతో కలిసి మంత్రి హర్షం వ్యక్తం చేశారు.

అందుకు బ్యాంక్ లు సైతం ముందుకు వచ్చాయని, దాన్యం కొనుగోలు జరగగానే డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయని వివారించారు.ఈసారి 70 లక్షల మెట్రిక్ టన్నుల దాన్యం వచ్చే అవకాశం ఉందని, ప్రతి గింజను ప్రభుత్వం నేరుగా కొంటామన్నారు.

Advertisement

కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర బీజేపీ నేతలు రైతులను రోడ్డున పడేస్తే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి అండగా నిలిచిందని అన్నారు.అసలైన రైతు బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని నినాదాలతో హోరెత్తించారు.

హీరోయిన్ సాయిపల్లవి మొటిమలకు సర్జరీ చేయించుకున్నారా.. ఆమె జవాబు ఇదే!
Advertisement

తాజా వార్తలు