బాలీవుడ్ సినిమాలను సౌత్ లో అందుకే చూడరు.. వైరల్ అవుతున్న హీరో రామ్ చరణ్ కామెంట్స్!

గత కొన్ని నెలలుగా సౌత్ ఇండస్ట్రీకి సంబంధించిన సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీలో అంచనాలను మించి కలెక్షన్లను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.

అయితే బాలీవుడ్ సినిమాలు మాత్రం సౌత్ ఇండస్ట్రీలో ఏ మాత్రం సత్తా చాటడం లేదు.

బాలీవుడ్ హీరోలు సౌత్ ఇండస్ట్రీలో మార్కెట్ ను పెంచుకోవాలని చూస్తున్నా భిన్నమైన అంచనాలు నెలకొన్నాయి.అక్కడి సినిమాలను ఇక్కడి ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు.

పలు బాలీవుడ్ సినిమాలకు హిట్ టాక్ వస్తున్నా వాస్తవంగా భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి.అయితే బాలీవుడ్ సినిమాలను సౌత్ ప్రేక్షకులు ఆదరించకపోవడం గురించి తాజాగా రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తాజాగా సల్మాన్ ఖాన్ మా సినిమాలను సౌత్ లో ఎందుకు చూడరో అంటూ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన చరణ్ బాలీవుడ్ డైరెక్టర్లతో పని చేయాలని తాను భావిస్తున్నానని అన్నారు.

Advertisement

సల్మాన్ ఖాన్ కామెంట్ల చరణ్ స్పందిస్తూ అలా చెప్పడం సల్మాన్ ఖాన్ తప్పు కాదని సినిమా తప్పు కూడా కాదని అన్నారు.ప్రధానంగా కథలో లోపం ఉందని తాను భావిస్తానని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.డైరెక్టర్లు సరిహద్దులను చెరిపేయాలని రామ్ చరణ్ కామెంట్లు చేశారు.

రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ లా ప్రతి రచయిత కథలు రాయగలరని రామ్ చరణ్ వెల్లడించారు.చరణ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

చరణ్ బాలీవుడ్ దర్శకుల డైరెక్షన్ లో పని చేయడానికి ఆసక్తి చూపిస్తుండగా కొందరు బాలీవుడ్ డైరెక్టర్లు సైతం చరణ్ తో పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నామని ఇప్పటికే వెల్లడించారు.చరణ్ ప్రధాన పాత్రలో నటించిన ఆచార్య ఈ నెల 29వ తేదీన థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాతో చరణ్ కోరుకున్న మరో సక్సెస్ దక్కుతుందేమో చూడాలి.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు