కన్నడ హీరో యష్ ప్రధాన పాత్రలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజిఎఫ్ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే.ఈ సినిమా విజయంతో దేశం మొత్తం కన్నడ సినీ పరిశ్రమ వైపు చూసింది.
ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగా కేజిఎఫ్ 2 ఏప్రిల్ 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ అన్ని భాషల్లోనూ విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుని సినిమాపై భారీ అంచనాలు పెంచేస్తున్నాయి.ఇక ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో పెద్దఎత్తున చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ తాను గత 20 సంవత్సరాల నుంచి ఎన్టీఆర్ కు అభిమానిగా మారిపోయానని తెలిపారు.
ప్రస్తుతం మేమిద్దరం మంచి స్నేహితులమయ్యామని, ఆ స్నేహంతోనే ఇటీవల ఎన్టీఆర్ కి ఓ కథ చెప్పగానే వెంటనే అతను ఒప్పుకున్నారు. తారక్ ఈ సినిమాకి ఓకే చెప్పడంతో వెంటనే సినిమా స్క్రిప్ట్ పనులు ప్రారంభించామని ఇలా స్క్రిప్ట్ పనులు ప్రారంభించిన తరువాత ఎన్టీఆర్ తాను ఒక పదిహేను సార్లు కలిశామని ప్రశాంత్ నీల్ తెలిపారు.ఇక ఈ సినిమా కోసం తాను ఎంతోఎగ్జైట్మెంట్ గా ఉన్నానని చెప్పుకొచ్చిన డైరెక్టర్ ఈ సినిమా ఏ జోనర్ లో తెరకెక్కుతోందనే విషయాన్ని మాత్రం అడగవద్దని ఈ సందర్భంగా ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.ప్రస్తుతం ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.
త్వరలోనే కొరటాల శివ సినిమాతో బిజీ కానున్నాడు.