బర్త్ డే రోజు విజయ్ చేసిన ఆ పని చూసి షాకయ్యాను పూజ కామెంట్స్ వైరల్!

రాధేశ్యామ్ సినిమాతో తీవ్ర నిరాశ చెందిన పూజా హెగ్డే తన తదుపరి చిత్రం బీస్ట్ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో విజయ్ దళపతి పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 13వ తేదీ విడుదల అవుతున్న సంగతి మనకు తెలిసిందే.

 Pooja Hegde Comments Viral By Talking About Vijay Details, Pooja Hegde, Tollywo-TeluguStop.com

ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇక ఈ సినిమా విడుదలకు మూడు రోజులు ఉండడంతో పూజా హెగ్డే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా పూజా హెగ్డే మాట్లాడుతూ ఎప్పటినుంచో తనకు నటుడు విజయ్ తో కలిసి నటించాలనే కోరిక ఉండేది.ఇన్ని రోజులకు నా కల నెరవేరిందంటూ సంతోషం వ్యక్తం చేశారు.

ఇక ఈ సినిమా నుంచి విడుదలైన అరబిక్ కుత్తు పాట గురించి మాట్లాడుతూ ఆ పాట తనకి ఎంతో గుర్తింపు తీసుకు వచ్చిందని పూజాహెగ్డే వెల్లడించారు.ఇక హీరో విజయ్ గురించి మాట్లాడుతూ ఆయన పై ప్రశంసలు కురిపించారు.

Telugu Beast, Vijay, Nelsondileep, Pooja Hegde, Tollywood-Movie

హీరో విజయ్ సినిమా సెట్ లో అందరితో ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారని, పని పట్ల ఆయన చూపే శ్రద్ధ, అంకిత భావం తనకు ఎంతో పూర్తిగా నిలిచాయని పూజా హెగ్డే హీరో విజయ్ పై ప్రశంసలు కురిపించారు.ఇక నా పుట్టినరోజు సందర్భంగా నాకు తెలియకుండా విజయ్ సర్ ప్రైజ్ పార్టీ అరేంజ్ చేశారు.ఒక స్టార్ హీరో అయ్యుండి ఈ విధంగా నా బర్త్డే రోజు పార్టీ ఇస్తారని అనుకోలేదు.ఆరోజు విజయ్ పార్టీ ఇవ్వడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని ఆ రోజు ఎప్పటికీ మర్చిపోలేనని పూజా హెగ్డే ఈ సందర్భంగా వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube