సోషల్ మీడియాలో ప్రతిరోజూ యాక్టివ్ గా ఉండే వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా తన మనసుని తాకిన వీడియోస్ ని తన వ్యక్తిగత ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేస్తూ ఉంటాడు.ఈ క్రమంలో వారికి తోచిన పారితోషికాన్ని కూడా ఇస్తూ ఉంటాడు.
కొంతమందికైతే తన సంస్థలో ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తాడు.ఈ క్రమంలోనే అతగాడిని ఓ వీడియో మనసు దోచుకుంది.
సదరు వీడియోని కూడా మహీంద్రా తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసాడు.ఇంతకీ అదేమిటని మీరు ఆలోచిస్తున్నారా?
అక్కడ అంతా వంపులు తిరిగిన రోడ్డు.తలపై పెద్ద దుస్తుల మూటతో ఓ సన్నని వ్యక్తి సైకిల్ ను స్పీడ్ గా తొక్కుకుంటూ పోతున్నాడు.కానీ ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమంటే, అతడి చేతులు సైకిల్ హ్యాండిల్ పై లేవు.
తలపై ఉన్న మూటను రెండు చేతులతో పట్టుకొని హ్యాండిల్ ను పూర్తిగా వదిలేసి అతడు సైకిల్ ను స్పీడుగా చకచకా తొక్కేస్తున్నాడు.సదరు వీడియోని చూసిన నెటిజన్లు అతగాడి తీరుకి సంబ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు.
ఎలాంటి తత్తరబాటు లేకుండా.సైకిల్ ను నియంత్రిస్తూ రోడ్డు వంపులను అలవోకగా దాటుకుంటూ వెళ్లే ఆ చాకలి తీరు నెటిజన్లను అబ్బురపరుస్తోంది.
ఆ సైకిల్ వెనకే కారులో ఫాలో అయిన వ్యక్తి ఈ వీడియోను తీసి సామాజిక మాధ్యమాల్లో పంచుకోగా అది కాస్తా ఆనంద్ మహీంద్రా కంట్లో పడింది.ఇక ఆయన ఆగుతారా? ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసి.“ఈ వ్యక్తి దేహంలో జైరోస్కోప్ ఉందా! అతడు మానవ సెగ్వే.సైకిల్ ను అతడు నియంత్రిస్తున్న విధానం సూపర్.
అయినప్పటికీ, నాకు బాధ కలిగించే విషయం ఏమిటంటే.మన దేశంలో అతనిలాంటి చాలా మంది ప్రతిభావంతులైన జిమ్నాస్టు/క్రీడాకారులు ఉన్నారు.
కానీ వారికి సరియైన గుర్తింపు, శిక్షణ లభించడం లేదు” అంటూ ట్వీట్ లో ఆ ధోబీ పై ప్రశంసలతో పాటు తన అభిప్రాయాన్ని తెలియజేసారు.